Parvathi Nair: ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపుల కేసు పెడతానంటూ వేధిస్తోన్న హీరోయిన్.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన పనిమనిషి..
గత నెల అక్టోబర్ 20న ఆమె ఇంట్లో రూ. 9 లక్షల విలువైన రెండు వాచీలు.. రూ. 1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ. 2 లక్షల విలువైన ల్యాప్ టాప్ చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె తన ఇంట్లో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తిపై నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఓ ప్రముఖ హీరోయిన్ తన ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తుందట. అంతేకాదు.. అతడిని పలుమార్లు కొట్టిందని.. మానసికంగా వేధిస్తుందని అతడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె వద్ద ఉండే సహచరులతో తనపై దాడి చేసిందని.. తనపై దొంగతనం ఆరోపణలు చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎవరా హీరోయిన్? .. అసలు విషయమేంటీ ? అని తెలుసుకుందాం. మలయాళ సినిమా హీరోయిన్ పార్వతీ నాయర్ చెన్నైలోని నుంగంబాకంలో నివాసముంటున్నారు. గత నెల అక్టోబర్ 20న ఆమె ఇంట్లో రూ. 9 లక్షల విలువైన రెండు వాచీలు.. రూ. 1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ. 2 లక్షల విలువైన ల్యాప్ టాప్ చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె తన ఇంట్లో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తిపై నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వారాంతంలో తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లినప్పుడు తన ఇంట్లో వస్తువులు పోయాయని.. వెంటనే తన ఇంట్లో పనిచేస్తున్న సుభాష్ వాటిని పట్టుకెళ్లాడని.. ఆ తర్వాత అతడు తన కాల్స్ లిఫ్ట్ చేయలేదని పార్వతి ఫిర్యాదులో పేర్కొంది.
అయితే సుభాష్.. హీరోయిన్ పార్వతి నాయర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఇంట్లో దొంగతనం జరిగినప్పటి నుంచి ఆమె తనను తీవ్రంగా కొట్టి హింసించిందని.. మానసికంగా వేధించేందని.. అంతేకాకుండా తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిస్తుందని చెప్పుకొచ్చాడు. అలాగ ఆమె తన సహచరులతో కలిసి తనపై దాడి చేసిందని తెలిపాడు. ఆమె ఇంటికి కొందరు వ్యక్తులు రావడం తాను చూసినప్పటి నుంచి తనపై దొంగతనం ఆరోపణలు చేసి మానసికంగా వేధిస్తుందని తెలిపాడు.
పార్వతి నాయర్.. తమిళ్, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది. సుభాష్.. తమిళ్ చిత్రపరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్.. ఓ ప్రముఖ నిర్మాత సిఫార్సుతో పార్వతి నాయర్ ఇంట్లో పనికి కుదిరాడు.