AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల వెంకన్న సన్నిధిలో మీనాక్షి చౌదరి.. కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్న హీరోయిన్

మీనాక్షి చౌదరి. సుశాంత్​ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.

తిరుమల వెంకన్న సన్నిధిలో మీనాక్షి చౌదరి.. కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్న హీరోయిన్
Meenakshi
Raju M P R
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 7:02 PM

Share

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. అలిపిరి నడక మార్గం నుంచి కొండ మెట్లు ఎక్కి  మీనాక్షి చౌదరి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో హీరోయిన్ మీనాక్షి చౌదరికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన మీనాక్షి చౌదరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇక మీనాక్షి సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మీనాక్షి దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి అనగనగ ఒకరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది మీనాక్షి. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.