ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..
హైదరాబాద్-బెంగళూరు NH44పై ప్రమాదకర ఆటో విన్యాసాలకు పాల్పడి ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ముగ్గురు యువకులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి, ఆటోలను సీజ్ చేశారు. ఇలాంటి చర్యలు జైలు శిక్షకు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు దారితీస్తాయని పోలీసులు హెచ్చరించారు. సరదా కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ప్రమాదకరం, రోడ్డు భద్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు.
సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ముగ్గురు యువకులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో, పంచలింగాల సర్కిల్ వద్ద ముగ్గురు యువకులు రెండు చక్రాలపై ఆటోలను నడుపుతూ అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు. రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులను సైతం ఇబ్బంది పెడుతూ వారు చేసిన ఈ విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై సమాచారం అందుకున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు మమతా నగర్‌కు చెందిన శివ మల్లేష్, అఖిల్ మరియు శ్రీకృష్ణ కాలనీకి చెందిన జయసింహగా గుర్తించారు. బుధవారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విన్యాసాలకు వాడిన ఆటోలను సీజ్ చేసి రవాణా శాఖకు అప్పగించారు. నిందితుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ .. రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సరదా కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెడితే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తాం అని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరట
లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్.. అంతలోనే.. ఇలా జరుగుతుందని అనుకోలేదు
TTD: అర్చకులకు టీటీడీ శిక్షణ ప్రారంభం
ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

