AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Tourism: పాత బస్సులే ఏసీ గదులు.. కేరళ ఆర్టీసీ ‘బడ్జెట్ స్టే’ ఐడియా అదిరిపోయిందిగా!

కేరళలోని మున్నార్‌ అంటే పచ్చని కొండలు, మంచు తెరల అందాలకు కేరాఫ్ అడ్రస్. అయితే, అక్కడ బస చేయాలంటే హోటల్ రూమ్‌ల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటాయి. కనీసం రూ. 2,000 నుండి రూ. 5,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, మీరు తక్కువ బడ్జెట్‌లో మున్నార్‌ను చుట్టి రావాలనుకుంటే కేరళ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఒక అద్భుతమైన సౌకర్యాన్ని కల్పిస్తోంది. కేవలం 220 రూపాయలకే ఏసీ వసతిని అందిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Kerala Tourism: పాత బస్సులే ఏసీ గదులు.. కేరళ ఆర్టీసీ 'బడ్జెట్ స్టే' ఐడియా అదిరిపోయిందిగా!
Munnar Ksrtc Bus Stay
Bhavani
|

Updated on: Feb 06, 2026 | 6:43 PM

Share

పాతబడిపోయిన ఆర్టీసీ బస్సులను పారేయకుండా, వాటిని అధునాతన ఏసీ డార్మిటరీలుగా మార్చి కేఎస్ఆర్‌టీసీ సరికొత్త విప్లవానికి తెరలేపింది. రైలులోని స్లీపర్ క్లాస్ మాదిరిగానే ఉండే ఈ బస్సులలో చార్జింగ్ పాయింట్లు, ఆహారం తీసుకోవడానికి ప్రత్యేక స్థలం వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. 2020లో ప్రారంభమైన ఈ సేవలకు పర్యాటకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కేవలం వసతి మాత్రమే కాదు, మున్నార్‌లోని పర్యాటక ప్రదేశాలను చూడటానికి కేఎస్ఆర్‌టీసీ డబుల్ డెక్కర్ బస్సు సేవలను కూడా అందిస్తోంది. ఈ బడ్జెట్ బసకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

KSRTC బడ్జెట్ బస ప్రత్యేకతలు:

ధరల వివరాలు: ఒక బెడ్‌కు కేవలం రూ. 160, దుప్పటి కోసం రూ. 60.. మొత్తం కలిపి రూ. 220 మాత్రమే.

వసతి సామర్థ్యం: ఒక బస్సులో 16 మంది వరకు బస చేయవచ్చు. అలాగే ఎనిమిది మంది ఉండే చిన్న డార్మిటరీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

సమయాలు: చెక్-ఇన్ సాయంత్రం 5.30 గంటలకు, చెక్-అవుట్ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు ఉంటుంది.

అదనపు సౌకర్యాలు: ఏసీ గదులతో పాటు మొబైల్ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. టాయిలెట్ సౌకర్యం బస్సు బయట డిపో లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది.

లోకేషన్: ఈ సౌకర్యం మున్నార్ కేఎస్ఆర్‌టీసీ డిపోలోనే అందుబాటులో ఉంటుంది. ఇది పర్యాటక ప్రదేశాలకు చేరువగా ఉండటం మరో ప్లస్ పాయింట్.

బుకింగ్ ఎలా చేసుకోవాలి?

ఈ వసతి సౌకర్యానికి ఆన్‌లైన్ బుకింగ్ అందుబాటులో లేదు. పర్యాటకులు నేరుగా మున్నార్ కేఎస్ఆర్‌టీసీ డిపోకు వెళ్లి అక్కడ బెడ్‌ను బుక్ చేసుకోవాలి. మీరు వెళ్లేముందు డిపోకు కాల్ చేసి ఖాళీలు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మంచిది.

Follow Us
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..