AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumathi Sathakam Movie Review: సుమతీ శతకం మూవీ రివ్యూ.. బిగ్‌బాస్ అమర్ దీప్ హీరోగా హిట్టు కొట్టాడా?

బుల్లితెరపై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన తాజా చిత్రం 'సుమతీ శతకం'. పక్కా పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ విలేజ్ డ్రామా ఆడియన్స్‌ని ఏ మేర ఆకట్టుకుంది? అమర్ దీప్ హీరోగా సక్సెస్ అయ్యాడా? రివ్యూలో చూద్దాం.

Sumathi Sathakam Movie Review: సుమతీ శతకం మూవీ రివ్యూ.. బిగ్‌బాస్ అమర్ దీప్ హీరోగా హిట్టు కొట్టాడా?
Sumathi Sathakam Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 11:05 PM

Share

మూవీ రివ్యూ: సుమతీ శతకం

నటీనటులు: అమర్ దీప్ చౌదరి, శైలి చౌదరి, మహేష్ విట్టా తదితరులు

దర్శకత్వం: ఎం.ఎం. నాయుడు

నిర్మాత: సాయి కొమ్మాలపాటి

విడుదల: మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్

కథ:

తూర్పు గోదావరి జిల్లా వైకుంఠపురంలో కృష్ణ (అమర్ దీప్) ఒక కిరాణా కొట్టు నడుపుతుంటాడు. కృష్ణకు చిన్నప్పటి నుంచే పెళ్లంటే విపరీతమైన క్రేజ్. తన పెళ్లి ఊరి తిరునాళ్లలో గుడిలోనే జరగాలని బలంగా కోరుకుంటాడు. ఈ క్రమంలో పక్క ఊర్లో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సుమతి (శైలి చౌదరి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సుమతికి అమ్మవారు ఆవహిస్తుందని.. ఆమె ఒక దేవత అని ఊరి జనం నమ్ముతుంటారు. సుమతిని పెళ్లి చేసుకోవాలనుకున్న కృష్ణకు ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది. మరోవైపు తన ఊరి తిరునాళ్లకు సంబంధించి ఒక సమస్య వస్తుంది. చివరికి ఆ సమస్యను కృష్ణ ఎలా పరిష్కరించాడు? దేవతలా కొలిచే సుమతిని పెళ్లి చేసుకోవడానికి ఊరి జనాలను ఎలా ఒప్పించాడు? అన్నదే మిగతా కథ.

కథనం:

దర్శకుడు ఎం.ఎం. నాయుడు ఒక గోదావరి చుట్టూ అల్లుకున్న పల్లెటూరి కథను ఎంచుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఎలాంటి అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని మలిచాడు. ఇక్కడి వరకైతే మనోడు బాగానే సక్సెస్ అయ్యాడు. కానీ కథ విషయంలోనే ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండుంటే బాగుండేది. హీరోకి పెళ్లి మీద ఉన్న ఆసక్తిని బేస్ చేసుకుని రాసుకున్న సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్ సీన్ బాగానే పేలింది. లవ్ స్టోరీ రెగ్యులర్‌గానే అనిపించినా.. హీరోయిన్‌కి దేవత ఆవహించడం అనే పాయింట్ కథలో కొత్తదనాన్ని, కామెడీని జెనరేట్ చేసింది. గ్రామ సర్పంచ్‌గా చేసిన మహేష్ విట్టా పాత్ర ద్వారా సోషల్ మీడియా పిచ్చి, వైరల్ అవ్వాలనే తాపత్రయంపై వేసిన సెటైర్లు బాగున్నాయి.. ఇవి పర్లేదనిపిస్తాయి. క్లైమాక్స్‌లో హీరోయిన్ కోసం హీరో పడే తపన, గ్రామస్తులను ఒప్పించే తీరు పర్వాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సరదాగా వెళ్లిపోతుంది. కాకపోతే అక్కడక్కడా కొన్ని ఓవర్ సీన్స్ ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేసుంటే బాగుండేది. సెకండాఫ్ కాస్త నెమ్మదిస్తుంది. ఇక అమీర్ దీప్ చౌదరి బాగానే నటించాడు కానీ ఎందుకో మరి మనోడిలో అక్కడక్కడా రవితేజ కనిపించాడు. ఫేవరేట్ హీరో కాబట్టి అలా ఆయనలోకి వచ్చి వెళ్లిపోయాడేమో మరి..?

నటీనటులు:

అమర్ దీప్ చౌదరి తన పాత్రలో చాలా ఈజీగా ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో, కామెడీ టైమింగ్‌లో పరిణితి కనబరిచాడు. కొన్ని చోట్ల బాడీ లాంగ్వేజ్ వేరే స్టార్ హీరోలను గుర్తు చేసినా, ఓవరాల్‌గా మెప్పించాడు. హీరోయిన్ శైలి చౌదరి అచ్చతెలుగమ్మాయిలా చాలా అందంగా కనిపించింది. నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. మహేష్ విట్టా కామెడీ ట్రాక్ సినిమాకు ప్లస్ అయ్యింది. తేజ సజ్జా కూడా పర్లేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే చేశారు.

టెక్నికల్ టీం:

మ్యూజిక్ పర్లేదు.. రెండు పాటలు క్యాచీగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. కోనసీమ అందాలను, పచ్చని పొలాలను కెమెరాలో చాలా అందంగా బంధించారు. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అక్కడక్కడా సినిమా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు కట్ చేసుంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ స్లో అయింది. దర్శకుడిగా నాయుడు తీసుకున్న కథ బాగానే ఉన్నా.. కథనంపై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సి ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కలిసొచ్చే విషయం.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సుమతీ శతకం.. పల్లెటూరి కథ.. కానీ కండీషన్స్ అప్లై..!

Follow Us
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..