Kriti Sanon: అది సృస్టించింది కూడా మనుషులేనని గుర్తుంచుకోవాలి.. ఏఐపై కృతి
ఇదే విషయమై తాజాగా అందాల తార కృతి సనన్ సైతం స్పందించారు. డీప్ ఫేక్ వీడియో గురించి తనదైన శైలిలో మాట్లాడారు. ఈ బ్యూటీ నటిస్తున్న తాజా చిత్రం ‘తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా’. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డీప్ ఫేక్ గురించి మాట్లాడారు...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సమాజానికి మేలు చేస్తున్న ఈ టెక్నాలజీ వల్లే ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన డీప్ ఫేక్ వీడియో ఎలాంటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించే పరిస్థితి వచ్చింది.
ఇదే విషయమై తాజాగా అందాల తార కృతి సనన్ సైతం స్పందించారు. డీప్ ఫేక్ వీడియో గురించి తనదైన శైలిలో మాట్లాడారు. ఈ బ్యూటీ నటిస్తున్న తాజా చిత్రం ‘తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా’. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డీప్ ఫేక్ గురించి మాట్లాడారు. ఈ ఫేక్ వీడియోలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సృష్టించింది కూడా మనిషే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కృతి అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై కృతి మాట్లాడుతూ.. డీప్‌ఫేక్‌ల విషయంలో టెక్నాలజీని నిందించడం తప్పు అని అభిప్రాయపడ్డ కృతి సనన్, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఏఐని సృష్టించింది కూడా మనుషులే అనే విషయం గుర్తుంచుకోవాలన్న కృతిసనన్.. టెక్నాలజీ అభివృద్ధి చూస్తుంటే.. భవిష్యత్తులో ఏఐ మన భాగస్వామి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే కృతి నటించిన తాజా చిత్రం తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో కృతి ఒక రోబో పాత్రలో కనిపించనుంది. సిఫ్రా అనే రోబో పోత్రలో కృతి కనిపించనుంది. ఇక ఈ సినిమాలో కృతితో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ కూడా నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




