డ్రగ్స్‌ కేసు: ప్రముఖ నటి సోదరుడు అరెస్ట్‌

| Edited By:

Oct 20, 2020 | 10:22 AM

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రియా, ఆమె సోదరుడు షోవిక్ సహా పలువురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

డ్రగ్స్‌ కేసు: ప్రముఖ నటి సోదరుడు అరెస్ట్‌
Follow us on

Bollywood Drugs Case: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రియా, ఆమె సోదరుడు షోవిక్ సహా పలువురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే రియా బెయిల్‌పై బయటకు వచ్చింది. ఇక తాజాగా మరో నటి సోదరుడుని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఊపిరి చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన గాబ్రియెల్లా డెమెట్రైడీస్‌ సోదరుడు అగిసియాలోస్‌ని లొనోవాలా రిసార్ట్‌లో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాదు అతడి వద్ద నుంచి అల్పాజోలమ్‌ ట్యాబెట్లు, హషీష్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటన తరువాత గాబ్రియెల్లా తన సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్‌ చేశారు. ప్రస్తుతం అగిసియాలోస్‌ని విచారిస్తున్న అధికారులు, అతడి నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దీనిపై ఎన్సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖడే మాట్లాడుతూ.. సుశాంత్‌ కేసులోని డ్రగ్స్ కోణంలో అగిసియాలోస్‌ని అరెస్ట్ చేశాము. అతడికి చాలా మంది డ్రగ్స్ డీలర్స్‌తో సంబంధాలు ఉన్నాయని గుర్తించాం అని తెలిపారు. కాగా ఈ కేసులో గాబ్రియెల్లా పార్ట్‌నర్‌, నటుడు అర్జున్‌ రాంపాల్‌ పేరు కూడా వినిపిస్తోంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,486 కొత్త కేసులు.. 7 మరణాలు

ఒకే స్కూల్‌లో 29 మంది విద్యార్థులకు కరోనా.. కర్నూల్‌ డీఈవో కీలక ఆదేశాలు