Ram Gopal Varma: ఆ అవకాశం ఉంటే వర్మనే పెళ్లిచేసుకునేదాన్ని: సంచలన నటి

వయస్సులో తన కంటే చాలా పెద్దవారైపోయారని, లేదంటే ఆయన్నే పెళ్లి చేసుకునేదాన్ని అని షాకింగ్ కామెంట్లు చేశారు సంచలన నటి గాయత్రీ గుప్తా. 'ఫిదా' సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా మంచి పేరు సంపాదించుకున్న గాయత్రీ.. ఆ తరువాత అడపాదడపా చిత్రాల్లో నటించింది.

Ram Gopal Varma: ఆ అవకాశం ఉంటే వర్మనే పెళ్లిచేసుకునేదాన్ని: సంచలన నటి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 26, 2020 | 8:36 PM

వయస్సులో తన కంటే చాలా పెద్దవారైపోయారని, లేదంటే ఆయన్నే పెళ్లి చేసుకునేదాన్ని అని షాకింగ్ కామెంట్లు చేశారు సంచలన నటి గాయత్రీ గుప్తా. ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా మంచి పేరు సంపాదించుకున్న గాయత్రీ.. ఆ తరువాత అడపాదడపా చిత్రాల్లో నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గాయత్రీ గుప్త పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్, మీటూ గురించి మాట్లాడినందుకు తనకు వచ్చిన అవకాశాలు కొన్ని పోయాయని గాయత్రి తెలిపారు.

ఇక వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీమ్‌లో నటించడంపై తన అభిప్రాయాలను గాయత్రి చెప్పుకొచ్చారు. ఆయనతో పనిచేస్తుంటే.. మారథాన్‌లో పాల్గొన్నట్లే ఉంటుందని గాయత్రి తెలిపారు. ఆయన చాలా మంచివాడని, అలాంటి వ్యక్తిని ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడలేదని ఈ నటి వెల్లడించారు. తనకంటే వయస్సులో చాలా పెద్దవారైపోయారని, లేదంటే ఆయననే పెళ్లి చేసుకునేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అలాంటి వ్యక్తి జీవితంలో ఉంటే చాలా బాగుంటుందని కితాబిచ్చారు గాయత్రి.  ఇక ఇటీవల వర్మను గుప్తా హగ్ చేసుకున్న ఓ ఫొటో వైరల్‌‌గా మారగా.. దానిపై కూడా ఆమె స్పందించారు. ఆయన ‘బ్యూటిఫుల్’ సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ ఉంటే రమ్మన్నారు. వర్మపై గౌరవం, అభిమానంతో అక్కడకు వెళ్లానని.. అదే అభిమానంతోనే ఆయనను హగ్ చేసుకున్నానని చెప్పుకొచ్చారు.