బాయ్‌ఫ్రెండ్‌తో ‘బిగ్‌బాస్’ బ్యూటీ నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి
టాలీవుడ్‌లో మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. ‘నేను’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘శ్రీ రామదాసు’, ‘పౌర్ణవి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన అర్చన(వేద) నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంకు ఆమె ఉంగరాన్ని తొడిగేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్-1లో అర్చన మిత్రులైన నవదీప్, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా బిగ్‌బాస్ 1సమయంలోనే […]

టాలీవుడ్‌లో మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. ‘నేను’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘శ్రీ రామదాసు’, ‘పౌర్ణవి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన అర్చన(వేద) నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంకు ఆమె ఉంగరాన్ని తొడిగేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్-1లో అర్చన మిత్రులైన నవదీప్, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కాగా బిగ్‌బాస్ 1సమయంలోనే తన బాయ్‌ఫ్రెండ్ గురించి రివీల్ చేసింది అర్చన. ఆ తరువాత అతడితో కలిసి ఉన్న రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ వచ్చిన అర్చన.. త్వరలో శుభవార్తను చెబుతానంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తపన అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అర్చన.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. కానీ సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. ఆ తరువాత పలు డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా పనిచేసింది.