Andrea: 20 ఏళ్ల వయసులోనే అతడితో డేటింగ్.. చివరకు దారుణంగా మోసపోయిన హీరోయిన్‌ ..

సంచలనకు కేరాఫ్‌ అడ్రస్‌ కోలీవుడ్‌ నటి ఆండ్రియా. ఏదో ఒక సంచలన కామెంట్స్‌ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుందీ బ్యూటీ. బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించడమే కాదు బోల్డ్‌ వ్యాఖ్యలతోనూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంది. మొన్నటి మొన్న తాను ఒక వ్యక్తిని నమ్మి సహజీవనం చేసి మోసపోయానని తెలిపి అందరినీ..

Andrea: 20 ఏళ్ల వయసులోనే అతడితో డేటింగ్.. చివరకు దారుణంగా మోసపోయిన హీరోయిన్‌ ..
Andrea Sensational Comments

Updated on: Nov 21, 2022 | 4:46 PM

సంచలనకు కేరాఫ్‌ అడ్రస్‌ కోలీవుడ్‌ నటి ఆండ్రియా. ఏదో ఒక సంచలన కామెంట్స్‌ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుందీ బ్యూటీ. బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించడమే కాదు బోల్డ్‌ వ్యాఖ్యలతోనూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంది. మొన్నటి మొన్న తాను ఒక వ్యక్తిని నమ్మి సహజీవనం చేసి మోసపోయానని తెలిపి అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. అతని వల్ల శరీరకంగా, మానసికంగా వేదనకు గురయ్యానని చెప్పిన ఆండ్రియా.. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారిందీ బ్యూటీ.

ప్రస్తుతం ఆండ్రియా హీరోయిన్‌ తెరకెక్కిన అనల్ మేలే పని తులి అనే చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాతో పాటు పిశాచి 2 చిత్రంలోనూ నటిస్తోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రియా మరోసారి సెన్సేషన్‌ కామెంట్స్‌ చేసింది. తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పిన ఆండ్రియా.. అతనితో పెళ్లి కూడా చేసుకోవాలుకున్నానని కానీ వర్కవుట్ కాలేదని చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి తనను చాలా దారుణంగా మోసం చేశాడని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇక పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పింది ఆండ్రియా. తనకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపిన ఆండ్రియా.. జీవితంలో ఆనందంగా గడపాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది యువతులు సంతోషంగా లేరన్న ఆండ్రియా పెళ్లి చేసుకోకుండా చాలా మంది సంతోషంగా జీవిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్న ఆండ్రియా భవిష్యత్తులో తన ఆలోచనను మార్చుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..