ఆ సమయంలో స్టార్ హీరోతో గొడవపడ్డా.. షాకింగ్ విషయం చెప్పిన నటుడు గిరిబాబు
వెటరన్ నటుడు గిరిబాబు పద్మాలయ స్టూడియోస్‌తో, సూపర్ స్టార్ కృష్ణ, హనుమంతరావు, బంగారులతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని తెలియజేశారు. తాను ఆర్టిస్టు అయినా కూడా, వారందరూ తనను సమానంగా చూసేవారని, ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని ఆయన అన్నారు. ఈ బంధం చాలా బలమైనదిగా అభివర్ణించారు.

సీనియర్ నటుడు గిరిబాబు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నో వైవిద్యమైన సినిమాలు చేసి అలరించారు గిరిబాబు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో గిరిబాబు మాట్లాడుతూ.. పద్మాలయ స్టూడియో నిర్మాణం, బ్యానర్ అభివృద్ధిలో కృష్ణ తమ్ముళ్లు హనుమంతరావు పాత్రను గిరిబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన గొప్ప మనిషి, బోళా శంకరుడని అన్నారు. హనుమంతరావు, బంగారు కలిసి స్టూడియోను, సంస్థను అద్భుతంగా అభివృద్ధి చేశారని, అనేక హిందీ, తెలుగు చిత్రాలు నిర్మించారని గిరిబాబు వెల్లడించారు. షూటింగ్స్ పూర్తయ్యాక తాను తరచుగా పద్మాలయ స్టూడియోకు వెళ్లేవాడినని, రాబోయే సినిమాల గురించి చర్చలు జరిగేవని ఆయన తెలిపారు. బంగారు, హనుమంతరావు తనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారని, స్క్రిప్టులు చదివి తన అభిప్రాయం చెప్పమని అడిగేవారని గిరిబాబు గుర్తుచేసుకున్నారు. తాను నటుడిగా, చిత్రాలు నిర్మించినవాడిగా ఉండటం వల్ల తనపై వారికి అపారమైన నమ్మకం ఉండేదని, “పురిటింటి కాపురం”, “అన్నదమ్ములు” వంటి కొన్ని సబ్జెక్టులను తాను వెంటనే ఆమోదించినట్లు వివరించారు.
ఇది కూడా చదవండి : Hema : అమ్మబాబోయ్.. హేమ కూతుర్ని చూశారా..!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు
కొన్ని సంఘటనలను కూడా గిరిబాబు పంచుకున్నారు. “సింహాసనం” షూటింగ్ సమయంలో హార్స్లీ హిల్స్‌లో బాలయ్య, హనుమంతరావు, బంగారు, తాను కూర్చున్నప్పుడు, రామమూర్తి “దొంగల దోపిడీ” కథను తీసుకొచ్చారని చెప్పారు. కథ విన్న తర్వాత తనకు నచ్చలేదని, అది విజయవంతం కాలేదని అన్నారు. “సింహగర్జన” షూటింగ్‌లో కృష్ణగారితో తనకు చిన్న సమస్య వచ్చిందని, స్థానికులతో చిన్న గొడవ జరగడంతో కృష్ణ, విజయనిర్మల ఇబ్బంది పడ్డారని, లొకేషన్ మార్చమని సూచించారని చెప్పారు. అయితే, హనుమంతరావు, బంగారు తనపై ఉన్న అభిమానంతో కృష్ణగారికి నచ్చచెప్పి, రెండు రోజుల్లోనే తిరిగి హార్స్లీ హిల్స్‌కు పంపించి షూటింగ్‌ను పూర్తి చేయించారని గిరిబాబు తెలిపారు. “కురుక్షేత్రం” షూటింగ్ జైపూర్‌లో జరుగుతున్నప్పుడు, పది మంది మేనేజర్లతో తీయలేని క్లైమాక్స్ సన్నివేశాన్ని తాను ఒక్కడినే తీయడం పట్ల హనుమంతరావు, బంగారు తనను ఎంతగానో మెచ్చుకున్నారని గిరిబాబు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Pawan Kalyan: డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్
పద్మాలయ, విజయ కృష్ణ మూవీస్ తీసే ప్రతి చిత్రంలో, కృష్ణగారు నటించే ఇతర సినిమాల్లో కూడా తనకు ఒక పాత్ర ఉండేదని, కథ చెప్పగానే “గిరిబాబు గారు ఈ క్యారెక్టర్‌కు” అని చెప్పేవారని అన్నారు. హనుమంతరావు, బంగారు అన్నదమ్ములు రాముడికి భరత, లక్ష్మణుల్లా ఆ సంస్థను అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడ్డారని, తెలుగు సినీ పరిశ్రమను మద్రాస్ నుండి ఇక్కడికి తీసుకురావడంలో స్టూడియో నిర్మాణం ద్వారా కీలక పాత్ర పోషించారని గిరిబాబు నొక్కి చెప్పారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ వంటి వారితో పాటు హనుమంతరావు, బంగారు కూడా పరిశ్రమ అభివృద్ధికి గొప్ప తోడ్పాటు అందించారని ఆయన ముగించారు.
ఇది కూడా చదవండి : 9 సినిమాలు.. 5 హిట్లు..! టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




