AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి హాస్పిటల్‌ నుంచి ఇంటికొచ్చిన భార్య.. తెల్లారే సరికి కనిపించని భర్త.. అసలు ట్విస్ట్ తెలిస్తే..

హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిలకానగర్‌లోని ప్రభుత్వ ఆదర్శ్ నగర్‌లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రాత్రి హాస్పిటల్‌ నుంచి ఇంటికొచ్చిన భార్య.. తెల్లారే సరికి కనిపించని భర్త.. అసలు ట్విస్ట్ తెలిస్తే..
Hyderabad Crime News
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 8:13 PM

Share

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ నేరాటు పెరిగిపోతున్నాయి. నిండునూరెళ్లు కలిసి బ్రతకాల్సిన భార్యభర్తలు చిన్న చిన్న కారణాలకే ఒకినొకరు చంపుకునే వరకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉప్పల్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసిస్తున్న జెస్సికా అనే మహిళ నర్సుగా పనిచేస్తుండగా, ఆమె భర్త సురేష్ క్యాబ్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులు గత నాలుగు సంవత్సరాలుగా ఆదర్శ్ నగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే గత కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతోనే సురేష్ ఆమెతో రతచూ గొడవలు పడేవాడు. ఇటీవల ఓ అడుగు ముందుకేసి ఏకంగా భార్యను మట్టుపెట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య అనంతరం సురేష్ ఘటన స్థలం నుంచి పరారైనట్లు సమాచారం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనాస్థలిని పరిశీలిస్తూ, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సురేష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలా, అనుమానమే హత్యకు కారణమా? లేక మరేదైనా నేపథ్యం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us