ఇన్ స్టా ద్వారా భారీగా సంపాదిస్తున్న జాన్వీ కపూర్..
Rajitha Chanti
Pic credit - Instagram
04 July 2026
ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు కేవలం సినిమాలపైనే కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా భారీగా ఆర్జిస్తున్నారు.
ముఖ్యంగా బాలివుడ్ బ్యూటీ, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్ సినిమాల ద్వారా పొందే రెమ్యునరేషన్ కంటే సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది.
జాన్వీ కపూర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన గ్లామరస్ ఫోటోషూట్‌లు, వెకేషన్ పిక్స్, జిమ్ లుక్స్‌తో ఎప్పుడూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
ఈ విపరీతమైన క్రేజ్ కారణంగానే ప్రముఖ బ్రాండ్‌లు ఆమెతో ప్రమోషన్స్ చేయించుకోవడానికి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు జాన్వీ ఇన్ స్టా సంపాదన గురించి నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది.
జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసే కేవలం ఒక్కో ప్రమోషనల్ పోస్ట్ లేదా ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ. 70 లక్షల నుండి రూ. 80 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
కేవలం విడివిడి పోస్టులే కాకుండా, ఆమె ఇండస్ట్రీలోని టాప్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.
నటన పరంగా చూస్తే.. జాన్వీ ఇటీవల 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది జాన్వీ.
సినిమాల కంటే సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమే చాలా తక్కువ శ్రమతో, అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలను తెచ్చిపెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.