Gold Prices: బంగారం ధరలపై బిగ్ న్యూస్.. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయా..? లేటెస్ట్ అంచనా ఇదే..
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్.. ఈ వారంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. డాలర్ క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆశలతో బంగారం ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరగడంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్. ఈ వారంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత వారంలో ధరలు భారీగా పతనమవ్వగా.. ఈ వారంలో ఒక్కసారిగా పెరిగాయి. ఈ వారంలో ఏకంగా గోల్డ్ రేటు రూ.6500 పెరగ్గా.. వెండి రూ.17 వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,170 డాలర్ల వద్ద ట్రేడవుతోండగా.. వెండి ఔన్సుకు సుమారు 62 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఈ వారం ఎంత పెరిగాయంటే..?
ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ వారంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,471 పెరగ్గా.. ప్రస్తుతం రూ.1,46,344 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఈ వారం రూ. 1,28,124 నుండి రూ.1,34,051కి చేరుకుంది. జూలై 1న రూ.1,39,434 వద్ద గోల్డ్ రేటు ప్రారంభమవ్వగా.. జూలై 3వ తేదీ సాయంత్రానికి రూ.1,46,344కు చేరుకుంది.
వెండి ధరలు చూస్తే..
ఈ వారంలో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ.17,317 పెరిగి ప్రస్తుతం రూ.2,33,858 వద్ద ట్రేడవుతున్నాయి. జూలై 1న వెండి ధర రూ.2,21,355గా ఉండగా.. జూలై 3కు రూ.2,33,858 వద్ద ట్రేడవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు ఎందుకు పెరిగాయి..?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బలహీనపడటం వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణం తగ్గుతుందనే ఆశలు పెరిగాయి. అలాగే డాలర్ క్షీణించడం వల్ల గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. డాలర్ సూచీ ఒత్తిడిలో ఉన్నంత కాలం, భౌగోళిక రాజకీయ లేదా స్థూల ఆర్థిక రంగంలో స్థిరత్వం సాధించనంత కాలం బంగారం, వెండి ధరలలో ఈ పెరుగుదల ధోరణి కొనసాగవచ్చని నిపుణులు చెబతున్నారు. రాబోయే రోజుల్లో డాలర్ మరింత బలహీనపడితే దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అధికంగానే ఉండవచ్చని తెలుస్తోంది. ఈ వారంలో భారీగా పెరడంతో కొనుగోలు చేసేవారు షాక్ అవుతున్నాయి. మరి వచ్చే వారంలో ధరలు ఇలాగే కొనసాగుతాయా.. లేదా తగ్గుతాయా అనేది చూడాలి.
