Brahmanandam: పంద్రాగస్టు పండుగలో నటుడు బ్రహ్మానందం.. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఇదే అంటే.. !

| Edited By: Jyothi Gadda

Aug 15, 2024 | 7:14 PM

దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను , త్యాగాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగ్స్ , వికలాంగులకు వీల్ ఛైర్ లను బ్రహ్మానందం అందజేశారు.

Brahmanandam: పంద్రాగస్టు పండుగలో నటుడు బ్రహ్మానందం.. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఇదే అంటే.. !
Brahmanandam
Follow us on

ఆనాడు స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో, నేడు దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నామని సినీ నటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. హైదరాబాద్ బేగంబజార్ లో భగత్ సింగ్ యువ సేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం అంటే.. కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదన్నారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే ఆగస్టు 15 ఉత్సవం అని అన్నారు.

సంక్రాంతి , రంజాన్ , క్రిస్మస్ పండుగలు ఎలానో , స్వాతంత్ర దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ అన్నారు బ్రహ్మానందం. దేశాన్ని రక్షిస్తున్న సైనికులు , దేశానికి తిండి పెడుతున్న రైతులు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు అన్నారు.. సినిమా థియేటర్ లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవడం బాధాకరమని అన్నారు.

దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను , త్యాగాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగ్స్ , వికలాంగులకు వీల్ ఛైర్ లను బ్రహ్మానందం అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..