Ajith Accident: దుబాయ్ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌కు గాయాలు.. వీడియో
దుబాయ్ కారు రేసులో స్టార్ హీరో అజిత్ గాయపడ్డారు. అజిత్ కారు వాల్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.. ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు అజిత్.. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ కుమార్ రేసింగ్ సర్క్యూట్ కొత్తేమీ కాదు. మోటర్స్పోర్ట్పై అతని అభిరుచికి పేరుగాంచిన అతను గతంలో టెస్ట్ రన్ కోసం బార్సిలోనాకు వెళ్లాడు, అజిత్ 24H దుబాయ్ 2025లో పాల్గొన్నారు. దాంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ,
హీరో అజిత్ కు ప్రమాదం జరిగింది. దుబాయ్ కారు రేసులో ప్రమాదం జరిగింది. అజిత్ డ్రైవ్ చేసిన కారు పల్టీలు కొట్టింది. అజిత్‌కు తృటిలో పెనుముప్పు తప్పింది. స్వల్పగాయాలతో హీరో అజిత్ బయటపడ్డారు. దుబాయ్ కారు రేసులో స్టార్ హీరో అజిత్ గాయపడ్డారు. అజిత్ కారు వాల్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.. ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు అజిత్.. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సినిమాలే కాకుండా తనకు అత్యంత ఇష్టమైన కార్ రేసింగ్ కోసం ఇటీవలే దుబాయ్ లో శిక్షణ తీసుకున్నాడు అజిత్.
ప్రస్తుతం అజిత్ కుమార్ తన రేసింగ్ టీమ్ తో కలిసి కార్ రేస్ జరుగుతున్నట్రాక్ పై ఈ-బైక్ నడుపుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అజిత్ సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి, బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కంటే ముందు ఆయన నటించిన విదాముయర్చి సినిమా పొంగల్ కు రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ వాయిదా పదండి. సినిమా విడుదల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా రూ.10 కోట్ల వరకు అప్పులు ఉన్నాయని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.