AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని విడాకులు.. క్లారిటీ ఇచ్చిన హీరో! అసలు మ్యాటర్ ఏంటంటే

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఆదిపినిశెట్టి. హీరోగా రాణిస్తూనే మరో వైపు విలన్ గాను మెప్పిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో ఆది పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా అఖండ 2 సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని విడాకులు.. క్లారిటీ ఇచ్చిన హీరో! అసలు మ్యాటర్ ఏంటంటే
Aadhi Pinisetty
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2026 | 3:56 PM

Share

నటుడు ఆది పినిశెట్టి ఓ  ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, తన వివాహం, నిక్కీ గల్రానితో అనుబంధం, విడాకుల పుకార్లపై స్పష్టత ఇచ్చారు. ఒక స్టార్‌గా, ఆది పినిశెట్టికి వేలాది ప్రపోజల్స్ వస్తాయని, సోషల్ మీడియా ఇన్బాక్స్‌లు నిండిపోతాయని యాంకర్ ప్రశ్నించగా, తాను సాధారణంగా వాటిని పట్టించుకోనని ఆది బదులిచ్చారు. కేవలం సినిమా ప్రమోషన్ల సమయంలో ట్యాగ్‌లు, మెసేజ్‌లు చూస్తానని, కానీ మిగతా సమయాల్లో చూడటానికి సమయం కూడా ఉండదని అన్నారు. జనాల్లోకి వెళ్లడానికి, సాధారణ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి మాస్క్ ధరించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ (బస్సు, మెట్రో) లో ప్రయాణిస్తానని, సాధారణ దుస్తులు ధరిస్తానని తెలిపారు. తన హెయిర్‌స్టైల్ మాత్రమే తనను గుర్తించేలా చేస్తుందని, షూటింగ్‌లు లేనప్పుడు చాలా సాధారణంగా ఉంటానని చెప్పారు. చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో జరిగే ఎగ్జిబిషన్‌లను సందర్శించడం తనకు ఇష్టమని, ఆ విధంగా ప్రజలతో మమేకమవుతానని వివరించారు.

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

వేలాది మంది ప్రపోజల్స్‌ను కాదని నిక్కీని ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు, నిక్కీ తన జీవితంలో రైట్ పర్సన్ అని ఆది పేర్కొన్నారు. ఆమె మొదట తనకు మంచి స్నేహితురాలని, తన కుటుంబంతో, తన సోదరుడితో నిక్కీకున్న బంధం నిజమైనదని, అది కాలంతో పాటు మసకబారేది కాదని అన్నారు. నిక్కీ చాలా బాధ్యతగల వ్యక్తి అని, తన పట్ల ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంటుందని చెప్పారు. అదే సమయంలో ఆమె సరదాగా ఉండే వ్యక్తి అని, మంచి ట్రావెల్ కంపానియన్ అని, తమ ఇద్దరి మధ్య ఒక భాగస్వామి కంటే ఒక స్నేహితుడితో ఉన్న భావన కలుగుతుందని ఆది అన్నారు.

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

తాను, నిక్కీ విడాకులు తీసుకుంటున్నారని వచ్చిన వార్తలపై ఆది తీవ్రంగా స్పందించారు. ఈ వార్త చూడగానే తనకు షాకింగ్‌గా అనిపించిందని, సంబంధమే లేకుండా ఇలాంటి వార్తలు ఎలా రాశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, సినీ రంగంలో ఉన్నవారు చిన్న విషయాలకు సున్నితంగా ఉండరని, మరింత దృఢంగా మారుతారని ఆది వివరించారు. ప్రతిరోజూ తిరస్కరణలను, 250 మంది వ్యక్తులతో పని చేసేటప్పుడు ఎదురయ్యే విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటామని చెప్పారు. అలాంటి వార్తలు వచ్చినప్పుడు కొద్దిసేపు బాధ అనిపించినా, దానిని పట్టించుకోవద్దని నిర్ణయించుకుంటానని అన్నారు. తాము సీరియస్‌గా తీసుకోని వారిని మనం ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలి అని ప్రశ్నిస్తూ, ఇలాంటి పుకార్లను నివారించడమే మంచిదని సూచించారు. సినిమా రివ్యూలను మాత్రం తాను అంగీకరిస్తానని, వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us