Pushpa 2: పుష్ప2 ట్రైలర్‌ వచ్చేది అప్పుడేనా.? టైమ్‌ ఫిక్స్‌..

|

Nov 05, 2024 | 2:43 PM

పుష్ప2 చిత్ర విడుదలకు సరిగ్గా ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేశారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది..

Pushpa 2: పుష్ప2 ట్రైలర్‌ వచ్చేది అప్పుడేనా.? టైమ్‌ ఫిక్స్‌..
Pushpa 2 Trailer
Follow us on

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ్యాప్తంగా మంచి బజ్‌ ఉంది. ఫస్ట్‌ పార్ట్ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ను సుకుమార్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఫస్ట్‌ పార్ట్‌కి మించిన యాక్షన్‌ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ 5వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ప్రమోషన్స్‌కు భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన మేకర్స్‌ మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌), భన్వర్‌సింగ్ షెకావత్‌ (ఫహద్‌ ఫాజిల్‌) ఎదురెదురుగా నిలబడి ఉన్న పోస్టర్‌తో పాటు సినిమాకు ఇంకా నెల రోజులు మాత్రమే ఉందంటూ పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే త్వరలోనే పుష్ప2 ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మరో పది రోజుల్లో ట్రైలర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నవంబర్‌ 15 లేదా 16వ తేదీన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు తెలుస్తోంది. అయితే ట్రైలర్‌ విడుదల కోసం ఒక ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ట్రైలర్‌తో పాటు అదే రోజు స్పెషల్ సాంగ్‌ లిరికల్‌ వీడియో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ఇక పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్‌ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్‌లో బాగంగా ఇప్పటికే.. పనులు మొదలు పెట్టేశారు. అమెరికాలోని థియేటర్స్‌లో పుష్ప పోస్టర్‌ను పాప్‌కార్న్‌ టబ్స్‌, కూల్‌ డ్రింక్స్‌ క్యాన్స్‌పై ప్రింట్‌ చేశారు. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..