Prabhas: డార్లింగ్ కోసం క్యూ కడుతోన్న బాలీవుడ్ బ్యూటీస్.. సందీప్ రెడ్డి సినిమా కోసం ఆ స్టార్ హీరోయిన్..
Prabhas: ప్రస్తుతం ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే అది కచ్చితంగా ఇండియా వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాల్సిందే. బాహుబలి (Bahubali)తో నేషనల్ హీరోగా మారిన ప్రభాస్‌తో నటించడానికి హీరోయిన్లు...
Prabhas: ప్రస్తుతం ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే అది కచ్చితంగా ఇండియా వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాల్సిందే. బాహుబలి (Bahubali)తో నేషనల్ హీరోగా మారిన ప్రభాస్‌తో నటించడానికి హీరోయిన్లు, సినిమాలు తీయడానికి దర్శకులు ఎంతో ఆసక్తిచూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతుండడంతో బాలీవుడ్ బ్యూటీస్‌ను హీరోయిన్‌గా తీసుకోవడానికి చిత్ర యూనిట్ మొగ్గుచూపుతోంది. దీనికి కారణం బాలీవుడ్ ప్రేక్షకుల అటెన్షన్‌ను సినిమాపై పడేలా చేసుకోవడం కోసమే. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న దాదాపు అన్ని సినిమాల్లో పాన్ ఇండియా రీచ్ ఉన్న హృరోయిన్లనే తీసుకుంటున్నారు.
ప్రభాస్ హీరోగా ఆదిపురుష్, సాహో, ప్రాజెక్ట్ కే చిత్రాలు బాలీవుడ్ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సినిమాలోనూ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్న తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పిరిట్ కోసం మరో బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కరీనా కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ వార్తే కనుక నిజమైలతే కరీనా కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుందన్నమాట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కేతో పాటు, సాలార్ మూవీలో బిజీగా ఉండగా, కరీనా కపూర్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..