AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DJ Tillu: రాధిక మారిపోనుందా.? డీజే టిల్లు సీక్వెల్‌లో నేహా శెట్టి కాదట.. మరి ఆ కొత్త హీరోయిన్‌ ఎవరంటే..

DJ Tillu: చిన్ని సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది డీజే టిల్లు చిత్రం. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. సిద్దు జొన్నలగడ్డ మార్క్‌ యాక్టింగ్‌తో సినిమాను..

DJ Tillu: రాధిక మారిపోనుందా.? డీజే టిల్లు సీక్వెల్‌లో నేహా శెట్టి కాదట.. మరి ఆ కొత్త హీరోయిన్‌ ఎవరంటే..
Narender Vaitla
|

Updated on: Aug 16, 2022 | 6:57 AM

Share

DJ Tillu: చిన్ని సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది డీజే టిల్లు చిత్రం. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. సిద్దు జొన్నలగడ్డ మార్క్‌ యాక్టింగ్‌తో సినిమాను విజయతీరాలకు చేర్చాడు. ఇక విమల్‌ కృష్ణ దర్శకత్వం సైతం సినిమాకు పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా సిద్దు డైలాగ్‌ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘అట్లుంటది మనతోని’ అంటూ తెలంగాణ యాసలో సిద్దు పలికిన సంభాషణలను సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మేకర్స్‌ ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్‌ అప్‌డేట్‌ వైరల్‌ అవుతోంది. తొలిపార్ట్‌లో తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న నేహా శెట్టి సీక్వెల్‌లో నటించడం లేదనేది సదరు వార్త సారంశం. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సీక్వెల్‌లో నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్‌ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Dj Tillu Anupama

ఇవి కూడా చదవండి

మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక 2022 ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 18 కోట్లు రాబట్టి కథలో మ్యాటర్ ఉండాలే కానీ చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేదని చాటి చెప్పింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..