Nani: మరోసారి ఫుల్‌ లెంత్‌ కామెడీ మూవీలో న్యాచురల్‌ స్టార్‌.. హిట్‌ ఇచ్చిన దర్శకుడికి నాని సెకండ్‌ ఛాన్స్‌..

Nani: 'టక్‌ జగదీశ్‌', 'శ్యామ్‌ సింగరాయ్‌', 'అంటే సుందరానికి'.. ఇలా వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. వరుస సినిమాలను లైన్‌లో పెడుతోన్న...

Nani: మరోసారి ఫుల్‌ లెంత్‌ కామెడీ మూవీలో న్యాచురల్‌ స్టార్‌.. హిట్‌ ఇచ్చిన దర్శకుడికి నాని సెకండ్‌ ఛాన్స్‌..
Nani

Updated on: Jun 22, 2022 | 10:02 AM

Nani: ‘టక్‌ జగదీశ్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’.. ఇలా వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. వరుస సినిమాలను లైన్‌లో పెడుతోన్న ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం ‘దసరా’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా చిత్రీకరణ పూర్తి అవ్వకముందే నాని మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్‌లో బ్లాక్‌ బ్లస్టర్‌ విజయాలలో ‘భలేభలేమగాడివోయ్‌’ ఒకటి. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది.

మతి మరుపు ఉన్న వ్యక్తి పాత్రలో నాని పండించిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం నాని మరోసారి మారుతితో చేతులు కలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మారుతి ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాన్ని పూర్తి చేశాడు. జూలై 1న ఈ సినిమా విడుదల కానుంది. గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ఇక నాని దసరా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

వీరిద్దరి ప్రాజెక్టులు పూర్తికాగానే కొత్త సినిమా ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అయితే మారుతి ప్రభాస్‌తో కూడా ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. మరి మారుతి, నాని కాంబినేషన్‌లో సినిమా నిజంగానే పట్టాలెక్కనుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..