Central Railway: సినిమా షూటింగ్ నుండి రైల్వే శాఖకు 2.48 కోట్లు. ఆదాయం.. అందులో సగం ఆ ఒక్క మూవీ నుంచే..

|

Jul 08, 2022 | 1:12 PM

కొన్ని ఏరియాల్లో సినిమా షూట్ చేయాలంటే సంబంధిత వ్యక్తి అనుమతి తప్పనిసరి. అనుమతి పొందడానికి భారీ (ఫీజ్‌)రెంట్‌ కూడా చెల్లించాలి. భారతీయ రైల్వే (ఇండియన్ రైల్వే) శాఖ కూడా ఈ విధంగా ఆదాయాన్ని పొందుతుంది. గత ఏడాదిలో..

Central Railway: సినిమా షూటింగ్ నుండి రైల్వే శాఖకు 2.48 కోట్లు. ఆదాయం.. అందులో సగం ఆ ఒక్క మూవీ నుంచే..
Central Railway
Follow us on

Central Railway: సినిమా షూటింగ్‌కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. పెద్ద సినిమాల టీమ్ లు వందల కోట్ల రూపాయలు వెచ్చించి తమ సినిమాలోని సన్నివేశాన్ని అందంగా తీయడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఏరియాల్లో సినిమా షూట్ చేయాలంటే సంబంధిత వ్యక్తి అనుమతి తప్పనిసరి. అనుమతి పొందడానికి భారీ (ఫీజ్‌)రెంట్‌ కూడా చెల్లించాలి. భారతీయ రైల్వే (ఇండియన్ రైల్వే) శాఖ కూడా ఈ విధంగా ఆదాయాన్ని పొందుతుంది. గత ఏడాదిలో 2.48 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చిత్ర బృందం ఎక్కువ చెల్లించడం విశేషం. చిత్రబృందం 1.27 కోట్ల రూపాయలు చెల్లించి రైల్వే స్టేషన్ ఆవరణలో షూట్ చేసింది.

కిరణ్ రావు గతంలో ‘ధోబీ ఘాట్’ చిత్రానికి దర్శకత్వం వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మరో సినిమాకు యాక్షన్‌ కట్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘2 పెళ్లికూతురు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పుడు టైటిల్‌ను ‘లపాట ​​లడ్కీ’గా మార్చినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనిపై కిరణ్ రావు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాకి సంబంధించి మొత్తం 50 రోజుల షూటింగ్ జరిగింది. అందులోనూ రైల్వే శాఖకు సంబంధించిన లొకేషన్లలో దాదాపు 24 రోజుల పాటు షూటింగ్ జరిగింది. 1.27 కోట్లు చెల్లించి ఆ లొకేషన్లలో చిత్రీకరణకు అనుమతి తీసుకున్నట్లు చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్పినట్లు బాలీవుడ్ టీమ్‌ పేర్కొంది. ఈ సినిమా కథకు రైలుకు సంబంధం ఏంటని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఆ సినిమాతో పాటు కిరణ్ రావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ట్రైలర్ ను కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. విడాకులు తీసుకున్న తర్వాత కూడా అమీర్ ఖాన్, కిరణ్ రావు కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి