Allu Arjun: బన్నీ మూవీపై ఇంట్రస్టింగ్ న్యూస్.. నిజమైతే ఫ్యాన్స్‌కు రచ్చే..!
ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడో చిత్రం కాగా.. త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో
ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడో చిత్రం కాగా.. త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు బన్నీ. దానికి సంబంధించి ఇప్పుడు లుక్ కోసం కసరత్తులు చేస్తున్నారు ఈ హీరో. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఎర్రచందనం మాఫియా నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారట.
లారీ డ్రైవర్‌గా, బిజినెస్‌మ్యాన్‌గా అల్లు అర్జున్ కనిపించబోతున్నారట. అంతేకాదు బిజినెస్‌మ్యాన్ రోల్ విలన్ పాత్ర అని తెలుస్తోంది. ఇందుకోసం రెండు డిఫరెంట్ స్టైల్స్‌లో కనిపించేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో నటించే మొదటి మూవీ ఇదే అవుతుంది. అలాగే విలన్‌గా నటించే మొదటి మూవీ కూడా ఇదే అవ్వనుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆర్య, ఆర్య 2 తరువాత బన్నీ, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్ధంలో లేదంటే వచ్చే ఏడాదిన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.