HBD Nani: టాక్సీవాలా దర్శకుడితో నాని.. టైటిల్, ప్రీలుక్ టీజర్ విడుదల..!
నాచురల్ స్టార్ నాని ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించబోయే 27వ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాని 27వ చిత్రంలో నటించబోతుండగా.. ఈ మూవీకి 'శ్యామ్ సింగరాయ్' అనే
నాచురల్ స్టార్ నాని ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించబోయే 27వ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాని 27వ చిత్రంలో నటించబోతుండగా.. ఈ మూవీకి ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేశారు. అందులో ఈ మూవీ విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చూస్తుంటే ఇది థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు అర్థమౌతోంది. ఇక సితారఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మస్తోన్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారకంగా తెలియనున్నాయి.
కాగా ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే చిత్రంలో నటిస్తున్నారు నాని. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక మరోవైపు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రంలో నటించారు నాని. ఇందులో ఈ హీరో విలన్ పాత్రలో నటించగా.. ఇటీవల వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.