Aditi Rao Hydari: సమంతపై ఫేక్ న్యూస్.. స్పందించిన బాలీవుడ్ బ్యూటీ..!

సాధారణంగా తమపై వచ్చిన గాసిప్‌లపై స్పందించడానికే కొంతమంది హీరోయిన్లు ఆసక్తిని చూపరు. అలాంటిది మరో హీరోయిన్‌పై వస్తే.. వాటిపై స్పందించే హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలా అరుదైన కోవలోకి తాజాగా చేరారు బాలీవుడ్ బ్యూటీ అదితీ రావు హైదరీ.

Aditi Rao Hydari: సమంతపై ఫేక్ న్యూస్.. స్పందించిన బాలీవుడ్ బ్యూటీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 24, 2020 | 4:55 PM

సాధారణంగా తమపై వచ్చిన గాసిప్‌లపై స్పందించడానికే కొంతమంది హీరోయిన్లు ఆసక్తిని చూపరు. అలాంటిది మరో హీరోయిన్‌పై వస్తే.. వాటిపై స్పందించే హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలా అరుదైన కోవలోకి తాజాగా చేరారు బాలీవుడ్ బ్యూటీ అదితీ రావు హైదరీ. నటి టాలెంట్‌ను ఓ సినిమా విజయం కానీ అపజయం కానీ జడ్జ్ చేయవని ఆమె అన్నారు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళ్తే..!

శర్వానంద్ హీరోగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి మహా సముద్రం అనే సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీలో హీరోయిన్‌గా సమంత ఫిక్స్ అయినట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జాను ఫ్లాప్ అయిన తరువాత ఈ మూవీ నుంచి సమంత తప్పుకుందని ఈ మధ్యన కొన్ని పుకార్లు వచ్చాయి. మరోవైపు జాను ఫ్లాప్ కారణంగా మేకర్స్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి సమంతను తీసేసినట్లు కూడా గాసిప్‌లు వినిపించాయి. అంతేకాదు ఆ స్థానంలో సమ్మోహనం బ్యూటీ అదితీ రావు హైదరీని తీసుకున్నట్లు కొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి.

ఈ క్రమంలో వాటిపై అదితీ సోషల్ మీడియాలో స్పందించింది. ‘‘దీనిపై నేను కచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నా. ఒక నటి టాలెంట్‌ను సినిమా విజయం గానీ, అపజయం గానీ జడ్జ్ చేయలేవు. దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి. ఇంకొకటి సినిమాలోని పాత్రాధారుల వివరాలను సదరు దర్శకుడు గానీ నిర్మాత గానీ ప్రకటించేవరకు ఆగండి. థ్యాంక్యు’’ అని అదితీ ట్వీట్ చేసింది. కానీ ఈ సినిమాను మొదట్లో రవితేజ‌తో తీయాలనుకున్నారు అజయ్. ఆ సమయంలో హీరోయిన్‌గా హైదరీ ఫిక్స్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వలన ఈ మూవీ నుంచి రవితేజ బయటకు వచ్చేయగా.. ఆ తరువాత శర్వానంద్ లైన్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.