RRR: ఇది మాములు మాస్‌ కాదు.. ఊర మాస్‌. ట్రాఫిక్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్‌ పాటకు స్టెప్పులు.. వైరల్‌ వీడియో..

|

Nov 15, 2021 | 8:24 AM

RRR: ప్రస్తుతం ఇండియన్‌ సినిమా మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాల్లో ఆర్‌.ఆర్.ఆర్‌ ఒకటి. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి బడా స్టార్‌లు కలిసి నటిస్తుండడం, అపజయం అంటూ ఎరగని రాజమౌళి దర్శకత్వం..

RRR: ఇది మాములు మాస్‌ కాదు.. ఊర మాస్‌. ట్రాఫిక్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్‌ పాటకు స్టెప్పులు.. వైరల్‌ వీడియో..
Rrr Viral Video
Follow us on

RRR: ప్రస్తుతం ఇండియన్‌ సినిమా మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాల్లో ఆర్‌.ఆర్.ఆర్‌ ఒకటి. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి బడా స్టార్‌లు కలిసి నటిస్తుండడం, అపజయం అంటూ ఎరగని రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. దీనికి తగ్గట్లుగానే చిత్ర యూనిట్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో కనివీని ఎరగని తారాగాణంతో పాటు అద్భుతమైన లోకేషన్స్‌లో తెరకెక్కించింది. ప్రస్తుతం దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుడండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను పెంచింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, టీజర్‌లను విడుదల చేసింది. ఇక ఇందులో భాగంగానే తాజాగా ‘నాటు నాటు’ అనే పాటను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ పాటలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు చేసిన మాస్‌ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా చెర్రీ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. ఇక వయసుతో సంబంధం లేకుండా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. దీంతో ఈ పాటకు సంబంధించిన డ్యాన్స్‌లు కొన్ని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఓ వీడియోనే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైక్‌పై వెళుతున్నాడు.. అదేసమయంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. తలకు హెల్మెట్‌ ధరించిన ఆ వ్యక్తి బైక్‌ నుంచి దిగి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఈ సీన్‌ను తొలుత షాక్‌కి గురయ్యారు. కానీ తర్వాత విషయం తెలుసుకొని తమ మొబైల్‌ ఫోన్‌ను తీసి వీడియో తీయడం ప్రారంభించారు.

ఇలా తీసిన వీడియోనే కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో కాస్త ఆర్‌.ఆర్‌.ఆర్‌ మేకర్స్‌ దృష్టిలో పడింది. దీంతో ఈ వీడియోను రీట్వీట్ చేసిన చిత్ర యూనిట్‌ ‘మాస్‌’ అనే క్యాప్షన్‌ జోడించింది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్‌ నటి ఒలివియా మోరిస్‌, అలియా భట్‌తో పాటు మరికొంత మంది భారీ తారాగణం నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉండి ఆకస్మిక ధనలాభం పొందుతారంటే.. నేటి రాశిఫలాలు

Corona Virus: కరోనా వైరస్‌తో యూరోపిన్ దేశాలు విలవిల.. టీకాలు కూడా వ్యాప్తిని ఆపలేదంటున్న డబ్ల్యూహెచ్‌ఓ..

Gold Price Today: మహిళలకు గమనిక.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే..?