Viral Video: ఒరబ్బయ్య ఆహా.. ఒరబ్బయ్య ఉహు.. వైరల్ సాంగ్ పాడిన చిన్నారి.. ఫన్నీ వీడియో
ఈ రెండు పాటలు వైరల్ అయ్యింది మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా.. విష్ణు నటించిన జిన్నా సినిమాలో ఒక జానపద గీతాన్ని వాడారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పాటల్లో జంపలకిడి జారు మిఠాయ ఒకటి మరొకటి ఒరబ్బయ్య అనే పాట. ఈ రెండు పాటలు వైరల్ అయ్యింది మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా.. విష్ణు నటించిన జిన్నా సినిమాలో ఒక జానపద గీతాన్ని వాడారు. చిత్తూరు జిల్లా జానపద గేయాలను ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అక్కడి మహిళల చేత పాడించారు. అయితే ఈ రెండు పాటలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ పాటలకు తమదైన శైలిలో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జంపాలకిడి జారు మిఠాయ.. పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే ఇప్పుడు ఒరబ్బయ్య అనే పాట కూడా వైరల్ అవుతుంది. నువ్వొస్తావనీ నేను ఒరబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటిని అంటూ సాగే ఈ పాటకు కూడా ఫన్నీ వీడియోలు చేస్తున్నారు నెటిజన్లు.
తాజాగా ఈ పాటను ఒక చిన్నారి పాడాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వచ్చి రాని మాటలతో ఆ చిన్నారి ముద్దుముద్దుగా ఈ పాటను పడుతూ ఆకట్టుకుంది. ఈ ఫన్నీ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ లో ఆమె పాట పాడుతూ మధ్య మధ్యలో చేసిన వింత శబ్దంను ఆ చిన్నారి చేయడం నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తుంది. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.




View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
