‘కుమారి’ కొత్త అవతారం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

'అలా ఎలా'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 'కుమారి 21f'తో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది హెబా పటేల్‌. అంతేకాదు కెరీర్ ప్రారంభంలోనే

  • Publish Date - 6:11 pm, Sat, 19 September 20 Edited By:
'కుమారి' కొత్త అవతారం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Hebah Patel look: ‘అలా ఎలా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ‘కుమారి 21f’తో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది హెబా పటేల్‌. అంతేకాదు కెరీర్ ప్రారంభంలోనే ఈ భామ వరుసగా ఐదు సక్సెస్‌లను ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ బ్యూటీ టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అందరూ భావించారు. అయితే ఆ తరువాత బోల్డ్‌ కారెక్టర్‌లకే పరిమితం కావడం, వరుసగా ప్లాప్‌లు రావడంతో కాస్త వెనుకబడి పోయింది.

కానీ ఈ ఏడాది భీష్మ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రెండో హీరోయిన్‌గా నటించినప్పటికీ, గుర్తుండిపోయే పాత్రలోనే కనిపించింది. మరోవైపు రాజ్‌తరుణ్, ఒరేయ్ బుజ్జిగాలోనూ రెండో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం అక్టోబర్‌లో ఓటీటీలో విడుదల కానుంది. ఇక రామ్ ‘రెడ్‌’ మూవీలోనూ ఐటం సాంగ్‌లో హెబా మెరిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ నటి ఓడెల రైల్వే స్టేషన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. ఇందులో ఆమె లుక్‌ లీక్ అయ్యింది.

గ్రామీణ మహిళ పాత్రలో మేకప్ లేకుండా హెబా నటిస్తోంది. ఈ ఫొటోలో హెబా సహజంగా కనిపిస్తుండగా.. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ చిత్రానికి అశోక్ తేజ అనే కొత్త వ్యక్తి దర్శకత్వం వహిస్తుండగా.. సంపత్ నంది స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే అందించారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ వశిష్ట సింహ హీరోగా నటిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Read More:

Bigg Boss 4: రెమ్యునరేషన్‌పై సూర్య కిరణ్ షాకింగ్ కామెంట్లు

అప్పుడు తప్ప ఎప్పుడూ స్మోక్ చేయను: రకుల్