వరల్డ్ డ్యాన్స్ షోలో రాక్‌స్టార్ సాంగ్.. ఆ టీంకి ఫస్ట్‌ ప్రైజ్

ప్రపంచ డ్యాన్స్‌ స్టేజ్‌ల మీద తెలుగు పాటలు దుమ్ములేపుతున్నాయి. ఆ మధ్య ‘ఖైదీ నంబర్.150’లోని ‘సుందరి’ సాంగ్‌కు భారత్ నుంచి ఎమ్‌జే 5 టీం డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో తెలుగు పాటకు స్టెప్పులతో ఇరగదీశారు ముంబైకి చెందిన ‘ది కింగ్స్’ టీం. ‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్‌’ పేరిట సాగుతున్న ఓ షోలో ‘సర్దార్ గబ్బర్‌‌సింగ్’ సినిమాలోని ‘వాడెవడన్నా వీడెవడన్నా’ పాటకు దుమ్ముదులిపారు ది కింగ్స్ టీం. ఆ పాటకు వారు ఆడుతున్నంతసేపు జడ్జిలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:16 pm, Mon, 6 May 19
వరల్డ్ డ్యాన్స్ షోలో రాక్‌స్టార్ సాంగ్.. ఆ టీంకి ఫస్ట్‌ ప్రైజ్

ప్రపంచ డ్యాన్స్‌ స్టేజ్‌ల మీద తెలుగు పాటలు దుమ్ములేపుతున్నాయి. ఆ మధ్య ‘ఖైదీ నంబర్.150’లోని ‘సుందరి’ సాంగ్‌కు భారత్ నుంచి ఎమ్‌జే 5 టీం డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో తెలుగు పాటకు స్టెప్పులతో ఇరగదీశారు ముంబైకి చెందిన ‘ది కింగ్స్’ టీం. ‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్‌’ పేరిట సాగుతున్న ఓ షోలో ‘సర్దార్ గబ్బర్‌‌సింగ్’ సినిమాలోని ‘వాడెవడన్నా వీడెవడన్నా’ పాటకు దుమ్ముదులిపారు ది కింగ్స్ టీం. ఆ పాటకు వారు ఆడుతున్నంతసేపు జడ్జిలు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అంతేకాదు ఈ షోలో అందరి మతి పోగిట్టిన ది కింగ్స్ టీం ఫస్ట్‌ప్రైజ్‌ను కొట్టేసింది.

ఇక ఈ విషయాన్ని సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ‘‘ఓ మై గాడ్.. వీరి డ్యాన్స్ అద్భుతంగా ఉంది. అప్పుడు ఖైదీ నంబర్.150లోని సుందరి పాట, ఇప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్‌లోని వాడెవడన్నా పాట ఇంటర్నేషనల్ డ్యాన్స్ స్టేజ్‌ల మీద వినిపించాయి. నా మ్యూజిక్ అందరి చేత డ్యాన్స్ వేయిస్తున్నందుకు చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నా. థ్యాంక్యు. లవ్ యు గయ్స్.. మీరు అదరగొట్టారు’’ అంటూ కామెంట్ పెట్టాడు.