గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ అధినేతకు సినీ పరిశ్రమ నుంచి బహిరంగంగా మద్దతు ప్రకటించిన నటుడు పృథ్విరాజ్.. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా ఫేమస్ అయిన పృథ్వి రాజ్ జగనన్న వెంటే నేను, ఈ జీవితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితం అంటూ ఆంధ్రపదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాలక్రమంలో అనుకోని పరిణామాల మధ్య వైసీపీ కి గుడ్ బై చెప్పారు.. జనసేనకు దగ్గరయ్యారు. అంతేకాదు తన ప్రయాణం ఇక నుంచి జనసేన పార్టీతోనే అని చెబుతున్నారు. అంతేకాదు తాను నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తానని.. పోటీ చేయనున్న నియోజక వర్గాన్ని కూడా ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రకటించారు.
వాస్తవానికి పృథ్వి సొంత ఊరు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం. అయితే తాను ఎన్నికల బరిలో అనకాపల్లి జిల్లాలోని చోడవరం నుంచి దిగనున్నానని వెల్లడించారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల విషయంలో ఏ మాత్రం విచారణ జరపకుండా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవి నుంచి తప్పించారంటూ గుర్తు చేసుకున్నారు. మరి వైసీపీలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వంటి వారిపై కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినా ఎటువంటి చర్యలు పార్టీ తీసుకోలేదని .. నా పై మాత్రమే చర్యలు తీసుకున్నారంటూ ఆరోపించారు.
తాను కరోనా సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కనీసం వైసీపీ ఏ విధంగా స్పందించలేదని.. సహాయం చేయలేదని చెప్పారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు నా స్థితి తెలుసుకుని వెంటనే స్పందించారు. చికిత్స అందించడం కోసం ఏర్పాట్లు చేశారని.. అప్పటి మా నుంచి ఇన్సూరెన్స్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. తనకు అప్పటి నుంచి మెగా ఫ్యామిలీని వదిలి తప్పు చేసినట్లు అనిపించిందన్నారు పృథ్వి.
తనను జనసేన అధినేత ఎన్నికల్లో ప్రచారం చేయమంటే పవన్ సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్తా.. చోడవరం నుంచి పోటీ చేయమన్నా తాను రెడీ అన్నారు. తనకు వైజాగ్ తో పాటు.. చోడవరం నియోజవర్గంలో బంధువులున్నారని.. తనకు తాతావరస అయ్యే బలిరెడ్డి సత్యారావు అని కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఈ నియోజవర్గంలో 44వేల మంది తన వాళ్ళు ఉన్నారంటూ వెల్లడించారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..