AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections: మీరు ఎవరికి ఓటేశారో ఈ మిషిన్‌ చెబుతుంది.. ఎలా తెలుసుకోవాలంటే..

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఎన్నికల కమిషన్ అనేక సంస్కరణలను చేపట్టింది. ముఖ్యంగా పోలింగ్‌లో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈవీఎంలలో వేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది. దీంతో మనకు నచ్చిన అభ్యర్థి, పార్టీకి సక్రమంగా ఓటు వేశామా లేదా క్రాస్ అయ్యిందా..

Elections: మీరు ఎవరికి ఓటేశారో ఈ మిషిన్‌ చెబుతుంది.. ఎలా తెలుసుకోవాలంటే..
Vvpat Machine
M Revan Reddy
| Edited By: Narender Vaitla|

Updated on: Nov 23, 2023 | 8:02 AM

Share

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ముఖ్యం. ఆత్రుతగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేస్తాం. కానీ మనం వేసిన ఓటు మనం అనుకున్న అభ్యర్థి, పార్టీకే వేశామా.? లేదా క్రాస్ అయిందా అనే అనుమానం, ఆందోళన కూడా ఒక్కోసారి వస్తుంది. అయితే అంది వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల సంఘం పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. టెక్నాలజీతో ఈవీఎంలో వేసిన ఓటును ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి వేశామో చూసుకునే అవకాశం కూడా ఎన్నికల కమిషన్ కల్పించింది.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఎన్నికల కమిషన్ అనేక సంస్కరణలను చేపట్టింది. ముఖ్యంగా పోలింగ్‌లో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈవీఎంలలో వేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది. దీంతో మనకు నచ్చిన అభ్యర్థి, పార్టీకి సక్రమంగా ఓటు వేశామా లేదా క్రాస్ అయ్యిందా అనే అనుమానాన్ని నివృత్తి చేసుకునే వీలుంది.

ఇందుకు కేవలం ఏడు సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ ప్యాట్) ద్వారా కల్పిస్తోంది. ఏడు సేకన్లలోపు వేసిన ఓటును వీవీ ప్యాట్ ద్వారా చూసుకునే వీలుంది. అనంతరం ఆ ఓటు వీవీప్యాట్ బాక్స్‌లో పడిపోతుంది. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేసింది. వీవీ ప్యాట్ విధానంతో పోలింగ్ పారదర్శకత, జవాబు దారితనం మరింతగా పెరిగింది. దీంతో వీవీ ప్యాట్ విధానాన్ని దశల వారీగా దేశమంతటా అమల్లోకి ఎన్నికల సంఘం తీసుకు వచ్చింది.

గతంలో కొందరు బ్యాలెట్ పేపర్ పై తమ సమస్యలు, డిమాండ్లను రాసేవారు. ఆలాంటి వాటిని ఎన్నికల కమిషన్ ఓట్లను రద్దు చేసేది. ఇదే తరహాలో వేసిన ఓటును సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, బహిర్గతం చేయడం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈవీఎంల ద్వారా అధికార పార్టీ అవకతవకలకు పాల్పడడం ద్వారా ఓడిపోయామని అభ్యర్థులు, పార్టీలు ఆందోళన చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేటి వరకు ఏ ఫిర్యాదు కూడా పూర్తిస్థాయిలో నిరూపితం కాకపోవడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..