West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తేదీల్లో మార్పులు? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం!

కరోనా మహమ్మారి దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ లక్షకు పైగా కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. తాజాగా ఒకేరోజు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి దేశవ్యాప్తంగా.

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తేదీల్లో మార్పులు? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం!
West Bengal Assembly Election
Follow us
KVD Varma

|

Updated on: Apr 15, 2021 | 7:50 PM

West Bengal: కరోనా మహమ్మారి దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ లక్షకు పైగా కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. తాజాగా ఒకేరోజు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి దేశవ్యాప్తంగా. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతూ వస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లోనూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎనిమిది విడతల్లో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా..ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మిగిలిన నాలుగు విడతల ఎన్నికలను మరో ఒకట్రెండు విడతల్లో పూర్తి చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి వినతులు అందుతున్నాయి. ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టతరంగా మారుతోందని అక్కడి ప్రభుత్వ వర్గాలు ఎన్నికల కమిషన్ కు నివేదించింది. దీంతో బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ లో మార్పు వస్తుందని అందరూ భావించారు. ఈమేరకు ఈసీ కూడా ఆలోచన చేస్తోందని వార్తలు వచ్చాయి. అదీకాకుండా ఈసీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడంతో ఎన్నికల వాయిదాపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే, ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. మిగిలిన నాలుగు విడతల ఎన్నికల తేదీల్లో మార్పులు చేసే యోచన లేదని స్పష్టంచేసింది. కేవలం బెంగాల్ ఎన్నికల్లో కోవిడ్-19 నిబంధనలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండేలా సూచించేందుకే శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ అధికారులు చెబుతున్నారు.

కాగా, బెంగాల్ ఎన్నికల ప్రచార సమయంలో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. గణాంకాలు చెప్పుతున్న ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాకా బెంగాల్ లో భారీగా కరోనా కేసులు నమోదు కావడంతో పాటు ఎక్కువ సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. మార్చిలో ఇక్కడ కేవలం 8 వేల మంది రోగులు మాత్రమే ఉన్నారు, ఇప్పుడది 41 వేలకు పైగా పెరిగింది. అయితే, గత 14 రోజుల్లో కరోనా వేగం 420% వృద్ధిని నమోదు చేసింది. మార్చి 16 నుండి 31 వరకు ఇక్కడ 8,062 మంది రోగులు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య ఏప్రిల్ 1-14 మధ్య ఈసారి 41 వేల 927 కు పెరిగింది. ఈ సమయంలో చాలా మరణాలు సంభవించాయి. మార్చిలో కేవలం 32 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోగా, ఈ 14 రోజుల్లో ఇప్పటివరకు 127 మంది మరణించారు. మరోవైపు ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఎంసీ, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రెండు పార్టీలకు చెందిన నాయకులూ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. దీంతో లక్షలాదిగా ప్రజలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇది ఇప్పుడు కరోనా వ్యఫ్తికి కారణంగా మారుతోంది. అందుకే అక్కడ ఎన్నికల షెడ్యూల్ సవరించాలని వినతులు వచ్చాయి. కానీ, ఎన్నికల సంఘం మాత్రం అది కుదరదని స్పష్టం చేస్తోంది.

Also Read: WB Polls 2021: కీలక ఘట్టానికి చేరిన బెంగాల్ ఎన్నికలు…టీఎంసీ-బీజేపీ మధ్య హోరాహోరీ

Avijit Ghosal: గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొల్లగొట్టిన వామపక్షాల ఓట్లను ఈ ఎన్నికల్లో నిలబెట్టుకుంటుందా?