UP Polls 2022: కాంగ్రెస్‌పై సంచలన కామెంట్స్ చేసిన యోగి ఆదిత్యనాథ్.. ఆ ఇద్దరూ చాలంటూ..
UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.

UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతమవడానికి వేరే వాళ్లు అవసరం లేదని, వీరిద్దరూ చాలని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘కాంగ్రెస్‌ను దాని కర్మకు వదిలేయాలి, ఉత్తరాఖండ్ వెళ్లి కూడా అదే చెప్పాను, కాంగ్రెస్‌ను అంతం చేయడానికి వేరే ఎవరూ అవసరం లేదు, ఆ ఇద్దరు తోబుట్టువులు చాలు’’ అని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కాంగ్రెస్ ఎక్కడైనా ఇంకా మిగిలి ఉంటే, దానిని కూడా ఆ ఇద్దరూ అంతం చేస్తారని, ఆ పార్టీని దాని కర్మకు వదిలేయాలని సంచలన కామెంట్స్ చేశారు యోగి. రాహుల్, ప్రియాంక మధ్య విభేదాలు ఉన్నాయని కూడా గతంలో ఆరోపించారు యూపీ సీఎం.
అయితే తన అన్న కోసం ప్రాణాలిస్తా అంటూ, ఆ ఆరోపణలను తిప్పికొట్టారు ప్రియాంకా. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న యోగి, ప్రతిపక్షాలపై దాడిని తీవ్రం చేస్తున్నారు. అటు కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదంపై కూడా స్పందించారు యోగి ఆదిత్యనాథ్. దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది తప్ప ముస్లిం చట్టం షరియత్ ప్రకారం కాదని స్పష్టం చేశారాయన. గజ్వా-ఎ-హింద్ ఎన్నటికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు యోగి. పాకిస్థాన్ ఇస్లామిక్ ఉగ్రవాదులు తరచూ ఈ పదాన్ని వాడటం గమనార్హం. గతంలోనూ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం 80 వర్సెస్ 20 అంటూ యోగి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే హిందూ, ముస్లింలను ఉద్దేశించే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాను వేరే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, 80 శాతం అభివృద్ధిని కోరుకునే వారు, 20 శాతం అన్నింటినీ వ్యతిరేకించే వారి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించినట్లు చెప్పారాయన.
Also read:
Andhra Pradesh: తండ్రిని మించిపోతున్న తనయడు.. కర్నూలులో చరిత్రను రిపీట్ చేసేనా!?
Medaram History: సమ్మక్క పసితనంలో నడయాడిన నేల ఏదో తెలుసా?.. మేడారం జాతర అసలు హిస్టరీ ఇదే..!