Khushbu Sundar files nomination : థౌజండ్ లైట్స్ కి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ

|

Mar 18, 2021 | 6:10 PM

Khushbu Sundar files nomination : డీఎంకే పార్టీకి కంచుకోట లాంటి థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో తాను తప్పక భారీ మెజారిటీతో..

Khushbu Sundar files nomination : థౌజండ్ లైట్స్ కి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ
Khushbusundar
Follow us on

Khushbu Sundar files nomination : డీఎంకే పార్టీకి కంచుకోట లాంటి థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో తాను తప్పక భారీ మెజారిటీతో గెలుస్తానని బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ ధీమా వ్యక్తం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేయడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బీజేపీ అభ్యర్థిగా ఖుష్భూ ఈ సారి రంగంలోకి దిగారు.

గతంలో డీఎంకే, కాంగ్రెస్‍ పార్టీలో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ సినీ నటి ఖుష్భూకు ఈసారి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇటీవలే బీజేపీలోకి చేరిన ఆమె, మొదట చేపాక్కం – ట్రిప్లికేన్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, పొత్తులో భాగంగా ఆ స్థానం అన్నాడీఎంకే పార్టీ.. పీఎంకే పార్టీకి కేటాయించింది. దీంతో ఆ నియోజకవర్గానికి పక్కనే ఉన్న థౌజండ్‍ లైట్స్ సీటును బీజేపీ ఖుష్బూకు ఖరారు చేసింది. ఇవాళ్టి ఖుష్బూ నామినేషన్ ప్రక్రియకు బీజేపీ భారీ ఏర్పాట్లు కూడా చేయడమేకాకుండా,  భారీగా జనసమీకరణ కూడా చేసింది. చెన్నైలోని వళ్ళువర్ కొట్టం దగ్గర నుంచి భారీగా మోహరించిన కార్యకర్తలకు అభివాదం చేస్తు ర్యాలీగా వెళ్లి ఖుష్భూ తన నామినేషన్ దాఖలు చేశారు. అటు, తన నియోజకవర్గంలో ఖుష్భూ విస్తృతంగా  ప్రచారం చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. తనకు మద్దతిచ్చి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

Read also : Vijayawada TDP : ఓడిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి-బుద్ధా ఫోన్ వాయిస్ లీక్, బెజవాడలో మునిగిపోతోన్న నావలా టీడీపీ.!