Voter card online: ఓటర్ ID కార్డు లేకుండా ఓటు వేయొచ్చా..? ఫ్రూఫ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు..

దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 19 నుండి తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. చివరి ఓటింగ్ జూన్ 1, 2024 న జరగనుంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తిన మూడు రోజుల తర్వాత అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Voter card online: ఓటర్ ID కార్డు లేకుండా ఓటు వేయొచ్చా..? ఫ్రూఫ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు..
Voter Id Card

Updated on: Mar 22, 2024 | 12:58 PM

దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 19 నుండి తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. చివరి ఓటింగ్ జూన్ 1, 2024 న జరగనుంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తిన మూడు రోజుల తర్వాత అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మీకు 18 సంవత్సరాలు నిండినట్లయితే లేదా 18 సంవత్సరాలు నిండబోతున్నట్లయితే ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్దకండి. అందుకు సంబంధించిన ఓటర్ ID కార్డ్‌ని కూడా పొందాలనుకుంటే, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో ఈ ఓటర్ ID కార్డ్ పొందవచ్చు. దాని దరఖాస్తు ప్రక్రియను ఇప్పుడు చూద్దాం.

ఒకప్పుడు ఓటరు గుర్తింపు కార్డు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఇంటి వద్ద కూర్చొని ఓటరు కార్డును పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పంచింది. ఆన్‌లైన్ ఓటరు ID కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాటికి ఎలాంటి వివరాలు, పత్రాలు అవసరం అవుతాయన్న దానిపై పూర్తి సమాచారం ఈ కథనంలో చదువుదాం. ఇప్పటికే లోక సభ ఎన్నికల తంతు ప్రారంభమైపోయింది. ఇలాంటి సమయంలో ఓటరు ఐడి కార్డు దరఖాస్తు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది. అలాంటి సందేహాలు నివృత్తి చేసేందుకు ఎన్నికల సేవా పోర్టల్‌ను సందర్శించడం ద్వారా కొత్త ఓటర్ ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓటరు గుర్తింపు కార్డు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..

ఓటరు ID కోసం కొత్తగా నమోదు చేసుకునే వ్యక్తులు ముందుగా voters.eci.gov.inకి వెళ్లాలి. ఓటర్ సర్వీస్ పోర్టల్‌కి వెళ్లిన తర్వాత, ఈ ప్రభుత్వ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో జనరల్ ఎలెక్టర్ల కోసం కొత్త రిజిస్ట్రేషన్ల ఎంపిక కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుంటే.. ఫారమ్ 6 కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో తెరవబడుతుంది. అందులో లాగిన్ అయి ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం సైన్ – అప్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత, మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ వంటి సమాచారం పొందుపరచాలి.

ఇవి కూడా చదవండి

వివరాలను పూర్తిగా నమోదు చేసిన తరువాత అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ తరువాత కంటిన్యూ అనే దానిపై క్లిక్ చేయండి. ఎప్పుడైనే ఓటర్ నమోదు పోర్టల్ లో మీ పేరుతో ఖాతాను సృష్టించబడుతుందో ఆ తరువాతే ఫారమ్ 6ని ఫిల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు నమోదు చేసిన తరువాత సంబంధిత డాక్యుమెంట్లు, ఫోటోలతో పాటు అడిగి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. తద్వారా ఎలాంటి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే ఓటర్ కార్డ్ ఆన్‌లైన్‌లో ఈ విధంగా పొందవచ్చు.

ఓటర్ ఐడీని దరఖాస్తు చేసిన తరువాత మనం ఇచ్చిన వివరాలు సరైనవేనా కాదా అని ఒకసారి తనిఖీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను పూర్తైన వెంటనే సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది, ఈ నంబర్‌ని ఉపయోగించి మీ అప్లికేషన్ స్టేటస్‎‏ను ట్రాక్ చేయగలరు.

కొత్త ఓటరు కార్డు దరఖాస్తు కోసం ఈ పత్రాలు అవసరం..

మీరు ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్ అవసరం అవుతాయి.

ఓటరు గుర్తింపు కార్డులో తప్పులు సరిదిద్దాలంటే ఎలా..

మీ ఓటరు IDలో ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ మీరు నివసించే ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి మారినట్లయితే, అటువంటి పరిస్థితిలో మీరు ఫారం 8ని పూరించాల్సి ఉంటుంది. తద్వారా అడ్రెస్ ఛేంజ్ ఆఫ్షన్ సెలెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఓటరు తనకు కావల్సిన, తెలియని సమాచారం కోసం ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేసి సహాయం కోరవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు.

ఓటరు గుర్తింపు కార్డు ఎన్ని రోజుల్లో వస్తుంది?

ప్రజలు ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లైతే తమ ఇంటి అడ్రస్‎కు రావడానికి ఎన్ని రోజుల్లో పడుతుంది అనే ఆలోచనలో ఉంటారు. ఎన్నికల సంఘం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 15 రోజుల తర్వాత ఓటరు ID కార్డ్ ఇంటికి వస్తుందని పోర్టల్‎లో పేర్కొన్నారు.

ఓటరు గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేయవచ్చా?

ఓటరు ఐడీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా ఇంకా ఓటర్ ఐడీ అందకపోతే ఓటు వేయవచ్చా అనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. మీ ఓటరు గుర్తింపు కార్డు రాకపోయినా పర్వాలేదు. దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లోనే EPIC నంబర్ ఖచ్చితంగా రూపొందించబడుతుంది. ఆన్‌లైన్‌కి వెళ్లి, మీ EPIC నంబర్ కేటాయించబడిందో లేదో సరిచూసుకొని ఆ EPIC నంబర్ ప్రింట్ అవుట్ తీసుకోండి. దీంతో పాటు ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను దరఖాస్తు చేసిన తరువాత వచ్చిన అక్నాలెడ్జ్‎మెంట్, ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న ప్రింట్ అవుట్‌ను చూపడం ద్వారా ఓటు వేయవచ్చు.

మరిన్ని ఎన్నికల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..