Election 2024: కౌంట్ డౌన్ మొదలైనట్టే..! ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం షురూ..

| Edited By: Shaik Madar Saheb

Apr 16, 2024 | 4:47 PM

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.

Election 2024: కౌంట్ డౌన్ మొదలైనట్టే..! ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం షురూ..
Election 2024
Follow us on

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.

తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఏఫ్రిల్ 18వ తేదీన మొదలు కానుంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించాయి. అయితే, బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న వెలువడుతుంది. ఏప్రిల్‌ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఏప్రిల్‌ 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుంది. జూన్‌ ఆరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదే:

ఏప్రిల్ 18 – నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్ 25 – నామినేషన్లకు చివరి తేదీ

ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన

ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ

మే 13 – పోలింగ్

జూన్ 4 – ఎన్నికల ఫలితాలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…