Cantonment Bypoll: బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ముక్కోణపు పోటీ..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. తమ పార్టీ అభ్యర్థిగా టీఎన్ వంశా తిలక్ పేరును బీజేపీ ఖరారు చేసింది. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టివి నారాయణ కుమారుడే వంశా తిలక్‌.

Cantonment Bypoll: బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ముక్కోణపు పోటీ..
BJP
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 16, 2024 | 12:14 PM

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశా తిలక్ (Dr T N Vamsha Tilak) పేరును బీజేపీ ఖరారు చేసింది. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టివి నారాయణ కుమారుడే వంశా తిలక్‌. బీజేపీ అభ్యర్థి ప్రకటనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఉపఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు.

దివంగత లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్‌ఎస్‌ బరిలోకి దించుతోంది. అటు కాంగ్రెస్‌ పార్టీ శ్రీగణేష్‌ను తమ అభ్యర్థిగా ఇది వరకే ప్రకటించింది. తాజాగా బీజేపీ వంశా తిలక్‌ను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌లో ముక్కోణపు పోటీకి తెరలేచింది. మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కంటోన్మెంట్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.