Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా.?

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం పది గంటలకే భానుడు ప్రతాపం చూపుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో చాలా మంది బయటి పనులను ఉదయం పదికల్లా పూర్తి చేసుకుంటున్నారు. లేదా సాయంత్రానికి వాయిదా వేస్తున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో...

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా.?
Rtc Bus
Follow us

|

Updated on: Apr 16, 2024 | 12:44 PM

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం పది గంటలకే భానుడు ప్రతాపం చూపుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో చాలా మంది బయటి పనులను ఉదయం పదికల్లా పూర్తి చేసుకుంటున్నారు. లేదా సాయంత్రానికి వాయిదా వేస్తున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో మధ్యాహ్నం రోడ్లపై ప్రజలు కనిపించడం లేదు. ఒకవేళ బయటకు రావాల్సి వచ్చిన కార్లు లేదా మెట్రోను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీస్తుంది. మధ్యాహ్నం రోడ్లపై ప్రజలు తక్కువగా ఉండడంతో బస్సులు ఖాళీగా ఉంటున్నాయని ఒక నిర్ణయానికి వచ్చారు. మధ్యాహ్నం పూట ప్రయాణికులు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను తగ్గిస్తున్నారు. ఈ విషయాని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు అధికారికంగా తెలిపారు. విపరీతమైన ఎండల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో బస్సులను ఖాళీగా తిప్పలకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ చేసిన ప్రకటనను కూడా ఆర్టీసీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే మంగళవారం నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఏ రూట్‌లో ఎన్ని బస్సులు తగ్గించనున్నారన్నదానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ 5 నిమిషాలకో బస్సు ఉన్న చోట 10 నిమిషాలు ఒక బస్సును నడపున్నారని తెలుస్తోంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావాకు మాస్ స్టెప్పులు..
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావాకు మాస్ స్టెప్పులు..
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్
వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్