Karnataka Elections: హైదరాబాద్‌కు రానున్న కర్నాటక ఎమ్మెల్యేలు.. ఇప్పటికే స్టార్ హోటల్స్‌లో బుక్ అయిపోయిన రూమ్స్

| Edited By: Ram Naramaneni

May 13, 2023 | 12:34 PM

కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతుంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరగగా.. 36 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో ఇప్పటికే ఆ పార్టీ నాయకలు సంబరాల్లో మునిగిపోయారు. మేజిక్ ఫిగర్‌కు కొంచెం అటూ ఇటూగా కాంగ్రెస్ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Karnataka Elections: హైదరాబాద్‌కు రానున్న కర్నాటక ఎమ్మెల్యేలు.. ఇప్పటికే స్టార్ హోటల్స్‌లో బుక్ అయిపోయిన రూమ్స్
Karnataka Elections
Follow us on

కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతుంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరగగా.. 36 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో ఇప్పటికే ఆ పార్టీ నాయకలు సంబరాల్లో మునిగిపోయారు. మేజిక్ ఫిగర్‌కు కొంచెం అటూ ఇటూగా కాంగ్రెస్ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కింగ్ మేకర్‌గా భావించిన జేడీఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపినట్లుగా కనిపించడం లేదు. ఆ పార్టీ అధినేత కుమార స్వామి కూడా వెనకంజలో ఉండటంతో తమ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. అయితే మరికొద్ది గంటల్లో కర్ణాటక చక్రం తిప్పేదెవరో తెలిసిపోతుంది. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలను బట్టి గెలిచిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తీసుకొస్తారనే సమాచారం వస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో రూమ్స్ బుక్ అయ్యాయి. తాజ్ కృష్ణలో 18 రూమ్స్, పార్క్ హయత్‌లో 20, నోవేటల్ లో 20 రూమ్స్ కర్ణాటక వ్యక్తుల మీద నిన్న బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా మరికొన్ని హోటల్స్‌లో బుక్ చేసినట్లు సమాచారం. అయితే ఏ పార్టీ నుంచి రూమ్స్ బుక్ చేశారో అనే విషయంపై తమ వద్ద సరైన సమాచారం లేదని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీల ఎమ్మెల్యేలు మారిపోతారా అనే విషయం తెర మీదకు వస్తోంది. అయితే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 అసెంబ్లీ సీట్లకు 113 సీట్ల మేజిక్ ఫిగర్ రావాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..