Investors’ Wealth Jump: బుల్ రన్ తో పెరిగిన మదుపరుల సంపద.. ఒక్కరోజే రూ. 5.4 లక్షల కోట్ల పెరుగుదల..

Investors' Wealth Jump: దేశీయ ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే ఏకంగా రూ. 5.4 లక్షల కోట్లు పెరిగింది. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు బుర్ జోరుతో(Bull run) కొనసాగుతున్నాయి.

Investors' Wealth Jump: బుల్ రన్ తో పెరిగిన మదుపరుల సంపద.. ఒక్కరోజే రూ. 5.4 లక్షల కోట్ల పెరుగుదల..
Stock Market
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 10, 2022 | 1:48 PM

Investors’ Wealth Jump: దేశీయ ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే ఏకంగా రూ. 5.4 లక్షల కోట్లు పెరిగింది. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు బుర్ జోరుతో(Bull run) కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖాండ్, మణిపూర్ లలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లలో బుధవారం నాటి ర్యాలీ BSE-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం రెండు రోజుల్లో రూ. 7,21,949.74 కోట్లు పెరిగి రూ. 2,48,32,780.78 కోట్లకు చేరుకుంది. ఇందులో పెట్టుబడిదారుల సంపద మంగళవారం రూ. 2.51 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

ఈ రోజు ప్రారంభంలోనే మార్కెట్ సూచీ సెన్సెక్స్ 1300 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసి 16,700 పాయింట్ల మార్కును దాటింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 7 లోపు భారత మార్కెట్లు నాలుగు ట్రేడింగ్ సెషన్లలో భారీ పతనాన్ని నమోదు చేశాయి.

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లైవ్ దిగువన చూడండి..

ఇవీ చదవండి..

Market Update: దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలు.. ఎన్నికల ఫలితాల వేళ సూచీల జోరు..

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. దాని వెనుక అసలు మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..