Election Results 2024: ప్రారంభమైన హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు.. వెలువడుతున్న ఫలితాలు

హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని 90 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరిగింది. మరోవైపు, హర్యానాలోని 90 స్థానాలకు ఒకే దశలో అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది.

Election Results 2024: ప్రారంభమైన హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు.. వెలువడుతున్న ఫలితాలు
Haryana And Jammu Kashmir Election Results
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 08, 2024 | 8:18 AM

హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని 90 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరిగింది. మరోవైపు, హర్యానాలోని 90 స్థానాలకు ఒకే దశలో అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు 93 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బాద్‌షాపూర్, గురుగ్రామ్, పటౌడీలో మాత్రమే 2-2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 87 స్థానాలకు ఒక్కో కౌంటింగ్ కేంద్రం ఉండగా, మంగళవారం (అక్టోబర్ 8) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హర్యానాలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందా లేక బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా అనేది ఈరోజు తేలనుంది.

జమ్ముకశ్మీర్‌లో హంగ్‌ వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పాయి. అయితే ఇక్కడి అసెంబ్లీ ముఖచిత్రం ప్రత్యేకంగా ఉంది. జమ్ముకశ్మీర్‌లో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జమ్ము ప్రాంతంలో 43 సీట్లు, కశ్మీర్‌ రీజియన్‌లో 47 సీట్లు ఉన్నాయి. అయితే అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్‌ చేసే అధికారం లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఉంది. ఈ పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ 48 అవుతుంది.

ఇక ఎన్నికల ఫలితాలు తెలుసుకోవడంతోపాటు ఒక్కో సీటుపై కన్నేసి ఉంచింది, ఏ పార్టీ వెనుకబడి ఉంది, ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు. ప్రతి అప్‌డేట్‌ను తెలుసుకోవడానికి ఇక్కడ లైవ్ ఫలితాలను చూడండి.