AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!

రాజకీయ చతురతతో కేసీఆర్ ను మించినవారు ఎవరు ఉండరేమో.. పార్లమెంట్ ఎన్నికల ముందు కీలక నేతలు పార్టీ వీడుతున్నా.. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయినా బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అదరలేదు. బెదరలేదు. తన రాజకీయ చాతుర్యంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటివారిని బీఆర్ఎస్ లో చేరేలా ప్రేరేపించారు. ఆయనతో పాటు బహుజన నేతలను పార్టీలో చేర్చుకోవడం లో సఫలమయ్యారు.

KCR: లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
KCR
Balu Jajala
|

Updated on: Mar 19, 2024 | 10:54 AM

Share

రాజకీయ చతురతతో కేసీఆర్ ను మించినవారు ఎవరు ఉండరేమో.. పార్లమెంట్ ఎన్నికల ముందు కీలక నేతలు పార్టీ వీడుతున్నా.. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయినా బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అదరలేదు. బెదరలేదు. తన రాజకీయ చాతుర్యంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటివారిని బీఆర్ఎస్ లో చేరేలా ప్రేరేపించారు. ఆయనతో పాటు బహుజన నేతలను పార్టీలో చేర్చుకోవడం లో సఫలమయ్యారు. అయితే కష్టకాలంలో ఇలాంటివారే తనకు కావాలని నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పకనే చెప్పారు. నేతలు పోయినా క్యాడర్ ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు. లోక్ సభ ఎన్నికలు తర్వాత కేసీఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏవిధంగా వ్యవహరిస్తారు అనేది వేచి చూడాల్సిందే.

రాజకీయ అంటేనే చదరంగం లాంటింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి తిరుగులేని అధికారం కట్టబెడితే.. ఇంకోసారి పాతాలంలోకి నెట్టేస్తోంది. మొత్తం రాజకీయ ఉనికినే ప్రశ్నార్థంగా మార్చేస్తుంది. రాజకీయాల్లో తిరుగులేని మహామహా నేతలే పరాజయం పాలై గుణపాఠాలు నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన అంతా బీఆర్ఎస్ పార్టీ గురించే. తెలంగాణ ఉద్యమ పార్టీగా పదేళ్లు అధికారంలోకి చెలాయించి ఢిల్లినీ సైతం వణికించిన పార్టీగా బీఆర్ఎస్ బలమైన గుర్తింపు ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్నే ఢీ అంటే ఢీ అనే స్థాయిలో బీఆర్ఎస్ తన ప్రభావం చాటుకుంది. కానీ ఇటీవల ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు గెలుచుకొని ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఊహించని పరిణామం అటు కేసీఆర్ కు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి జీర్ణించుకోలేని విధంగా చేసింది.

ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీ బలమైన వాణి వినాలనిపించుకుంటున్న తరుణంలో కాళేశ్వరం, లిక్కర్ స్కామ్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు సమీంచడంతో ఉద్యమ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇన్నాళ్లు పదేళ్లు అధికారంలో ఉన్న నేతలంతా చేజారిపోతుండటంతో బీఆర్ఎస్ నేతల్లో అయోమయం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం, గ్రేటర్ హైదరాబాద్ లో బొంతు రామ్మోహన్, బాబా ఫసియొద్దిన్, కీలక కార్పొరేటర్లు హస్తం గూటికి చేరుకొని బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు గుప్పుమంటున్నారు. అదే దారిలో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.