ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై యువ‌తి కిడ్నాప్‌.. క‌ల‌క‌లం సృష్టిస్తోన్న ఘ‌ట‌న‌

ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై యువ‌తి కిడ్నాప్‌.. క‌ల‌క‌లం సృష్టిస్తోన్న ఘ‌ట‌న‌

ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై యువ‌తిని కిడ్నాప్ చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఓ కారులో వ‌చ్చిన దుండ‌గులు సోద‌రి క‌ళ్ల ముందే ఆమెను ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని కోలార్‌లో జ‌రిగింది. యువ‌తి కిడ్నాప్ దృశ్యాలు ఓ దుకాణంలోని..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 2:47 PM

ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై యువ‌తిని కిడ్నాప్ చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఓ కారులో వ‌చ్చిన దుండ‌గులు సోద‌రి క‌ళ్ల ముందే ఆమెను ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని కోలార్‌లో జ‌రిగింది. యువ‌తి కిడ్నాప్ దృశ్యాలు ఓ దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నాట‌క‌లోని కోలారులోని ఎంజీ రోడ్డులో ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు న‌డుచుకుంటూ వెళ్తున్నారు. అయితే వారికి తెలియ‌కుండా వెన‌కాలే ఓ ఇన్నోవా కారు ఫాలో అయింది. రోడ్డుపై ఎవ‌రూ లేని స‌మ‌యంలో కారు నుంచి దిగిన దుండ‌గులు 21 ఏళ్ల యువ‌తిని బ‌ల‌వంతంగా కారులోకి ఎక్కించారు. బాధితురాలి సోద‌రి ఎంత ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ ఆమెను ప‌క్క‌కు తోసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు దుండ‌గులు.

కాగా బాధితురాలి సోద‌రి వెంట‌నే ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. వెంట‌నే గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. కిడ్నాప్ చేసిన వ్య‌క్తిని కోలారులోని దేవాంగ‌పేట‌కు చెందిన శివుగా గుర్తించారు పోలీసులు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా యువ‌తి కిడ్నాప్ అయిన ప్రాంతంలోని ఓ దుకాణంలో రికార్డ‌యిన‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Read More:

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu