AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముర్బాద్ జలపాతంలో ఇద్దరు గల్లంతు.. ఒకరు మృతి

మహారాష్ట్రలో విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. థానే జిల్లాలోని ముర్బాద్ తాలూకాలోని జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

ముర్బాద్ జలపాతంలో ఇద్దరు గల్లంతు.. ఒకరు మృతి
Balaraju Goud
|

Updated on: Aug 14, 2020 | 3:00 PM

Share

మహారాష్ట్రలో విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. థానే జిల్లాలోని ముర్బాద్ తాలూకాలోని జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అంబోలి గ్రామానికి చెందిన 12 మంది యువకులు గురువారం మధ్యాహ్నం ఖోపివిలిలోని జలపాతంలో ఈత కొట్టడానికి వెళ్లారు. అందులో ఉమేశ్‌ టుబ్కడ్లే(25), కార్తీక్‌ గాడ్జ్‌ (25)అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయారు. గల్లంతైనవారి కోసం వారి స్నేహితులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టగా ఉమేశ్‌ మృతదేహం లభించింది. కార్తీక్‌ కోసం వెతుకుతున్నట్లు ముర్బాద్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి శుక్రవారం తెలిపారు. దీంతో థానే, పాల్ఘర్ జిల్లాల కలెక్టర్లు వానకాలంలో ఇలాంటి ప్రమాదాలను నివారణకు చర్యలు చేపట్టారు. జల ప్రవాహం కలిగిన ప్రాంతాల వద్ద ఎవరినీ అనుమతించవద్దని ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే