AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌ ఫెయిల్‌.. బాబా అవతారమెత్తి.. మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత..

బాబాల అవతారమెత్తి.. ప్రజల్ని మోసం చేసే బ్యాచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజల మూఢనమ్మకాలను తమ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి.. ఊరికో బాబాలు పుట్టుకొస్తున్నారు. ఇలా బాబాల అవతారమెత్తిన వారు..

ఇంటర్‌ ఫెయిల్‌.. బాబా అవతారమెత్తి.. మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 4:06 PM

Share

బాబాల అవతారమెత్తి.. ప్రజల్ని మోసం చేసే బ్యాచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజల మూఢనమ్మకాలను తమ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి.. ఊరికో బాబాలు పుట్టుకొస్తున్నారు. ఇలా బాబాల అవతారమెత్తిన వారు.. కొందరు సమాజ సేవలు చేస్తే.. మరికొంత మంది బాబాల పేరుకే అపకీర్తి తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. బాబాల పేరుతో అక్రమ దందాలు, మహిళలపై అత్యాచారాలు, దోపిడీలు ఇలా అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు పేరుమోసిన బాబాలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి కటకటాలపాలైన సంగతి తెలిసిందే. అందులో డేరా బాబా గురించి తెలిసిందే. ఆశ్రమం మాటున మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ వ్యక్తి డేరాబాబాలా అవతారమెత్తాడు. దుబ్బాక మండలం చీకోడ్‌లో ఓ వ్యక్తి సమర్ధ మహారాజ్‌ పేరుతో స్వామీజీ అవతారమెత్తాడు. ధర్మాజీ పేటకు చెందిన రఘు అనే వ్యక్తి ఇంటర్‌ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇక చదువుకుంటే లాభం లేదని.. బాబా అవతారం ఎత్తాడు. అయితే బాబా అని నమ్మిన ఓ మహిళ ఇతడి వద్దకు వచ్చింది. సదరు మహిళ ఓ అమ్మవారి గుడికట్టాలని సంకల్పించింది. అయితే దీనిని ఆసరగా చేసుకున్న స్వామీజీ అలియాస్ రఘు ఆమెపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయన శిష్యుడు నరేష్‌తో కలిసి సదరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాబాగా చెలామణి అవుతున్న రఘపై, ఆయన శిష్యుడు నరేష్‌లపై పోలీసులు సెక్షన్‌ 420,376,508,109 కింద కేసులు నమోదు చేశారు. అయితే సదరు మహిళ ఫిర్యాదు చేసే దానికంటే ముందే.. ఆశ్రమ నిర్వాహకులు మహిళపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నరేష్‌ను అదుపులోకి తీసుకోగా.. రఘ పరారీలో ఉన్నాడు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు