దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం.. ఇంట్లో నుంచి అలిగి వెళ్లిన యువతి.. కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. 22 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. బాధిత యువత కుటుంబం శకర్ బస్తీ రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముంటున్నారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం.. ఇంట్లో నుంచి అలిగి వెళ్లిన యువతి.. కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం..
Shiva Prajapati

|

Dec 13, 2020 | 9:24 PM

దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. 22 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. బాధిత యువత కుటుంబం శకర్ బస్తీ రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముంటున్నారు. అయితే ఇంట్లో వాళ్లతో ఘర్షణ పడి శకర్‌బస్తీ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అక్కడ ప్లాట్‌ఫామ్‌పై ఒంటరిగా కూర్చుకుంది. ఇది గమనించిన ముగ్గురు వ్యక్తులు యువతి వద్దకు వచ్చారు. తొలుత యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతి ప్రతిఘటించడంతో రెచ్చిపోయిన దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని యువతిని బెదిరించారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు. అయితే బాధిత యువతి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu