AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగాళ్లు బీ కేర్‌ఫుల్ విత్ యువర్ వైఫ్స్.. ఈ స్టోరీ చూస్తే షాక్ తినాల్సిందే..

రోజురోజుకు మానవ సంబంధాలు కాస్త.. ధనంతోనే మునిపడుతున్నాయి. ధనం ఉంటే చాలు.. అంతే ఇంకా ఏం అక్కర్లేదనే విధంగా తయారవుతున్నాడు మనిషి. డబ్బుల విషయంలో భార్యాభర్తలకు చిల్లర గొడవలు రావడం సహజమే. కానీ.. ఇరువురి మధ్య అప్పులు ఉన్నాయని హత్యలకు దారితీసిన వార్తలు మాత్రం.. బహుశా మనదేశంలో మాత్రం ఎక్కడా వినలేదు. కానీ బెంగుళూరులో జరిగిన ఘటన చూస్తే.. ఇక మగాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఇక అంతే సంగతులు. డబ్బుల విషయమై వచ్చిన చిన్న […]

మగాళ్లు బీ కేర్‌ఫుల్ విత్ యువర్ వైఫ్స్.. ఈ స్టోరీ చూస్తే షాక్ తినాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 29, 2020 | 4:20 PM

Share

రోజురోజుకు మానవ సంబంధాలు కాస్త.. ధనంతోనే మునిపడుతున్నాయి. ధనం ఉంటే చాలు.. అంతే ఇంకా ఏం అక్కర్లేదనే విధంగా తయారవుతున్నాడు మనిషి. డబ్బుల విషయంలో భార్యాభర్తలకు చిల్లర గొడవలు రావడం సహజమే. కానీ.. ఇరువురి మధ్య అప్పులు ఉన్నాయని హత్యలకు దారితీసిన వార్తలు మాత్రం.. బహుశా మనదేశంలో మాత్రం ఎక్కడా వినలేదు. కానీ బెంగుళూరులో జరిగిన ఘటన చూస్తే.. ఇక మగాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఇక అంతే సంగతులు. డబ్బుల విషయమై వచ్చిన చిన్న గొడవ కాస్త.. ఓ మహిళను నేరస్థురాలిని చేసింది. డబ్బులు ఇవ్వలేదని తన రెండో భర్తను కిడ్నాప్ చేయించి.. ఆ తర్వాత తీవ్రంగా హింసించి.. హతమార్చింది.

వివరాల్లోకి వెళితే.. చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల సమీపంలో ఉన్న ముడిగుండం గ్రామంలో దారుణం జరిగింది. బెంగళూరులో ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న సుబ్రమణ్యం అనే వ్యక్తిని.. తన భార్య హతమార్చింది. నగదు వ్యవహారంలో వచ్చిన చిన్న గొడవ కాస్త పెద్దగా మారడంతో.. తన సోదరుడు, అతని ఇద్దరు స్నేహితులతో కలిసి భర్తను కిడ్నాప్‌ చేయించింది. చేసి సుమారు ఐదు రోజుల పాటు ఓ ఇంట్లో బంధించింది. అనంతరం చిత్ర విచిత్రంగా హింసించింది. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు బెంగళూరులో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న రశ్మి. ఆమెను కొళ్లెగాల పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆమె సోదరుడు రాకేష్, అతని ఇద్దరు స్నేహితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

ఏకంగా ఐదు రోజుల పాటు…

అయితే రష్మి తన సోదరుడు.. అతని స్నేహితుల సహాయంతో తన భర్తను కిడ్నాప్ చేసింది. ఓ రూంలో బంధించి.. అతన్ని చిత్రహింసలకు గురిచేసింది. చేతి గోళ్ళను పీకివేయడంతోపాటు.. ఇనుప రాడ్‌లతో తీవ్రంగా కొట్టి హింసించారు. దీంతో సుబ్రమణ్యం స్పృహకోల్పోయి.. ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. వెంటనే రష్మి.. తన సోదరుడు.. అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే సుబ్రమణ్యం పరిస్థితిని స్థానికులు గుర్తించి వెంటనే ఆయన్న స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ.. మంగళవారం రోజు ప్రాణాలు విడిచాడు. అయితే ఆస్పత్రిలో ఉన్న సమయంలో పోలీసులు సుబ్రమణ్యం దగ్గర తీసుకున్న ఫిర్యాదు మేరుకు.. రశ్మిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే సుబ్రమణ్యం బెట్టింగ్‌ కోసం తన డబ్బులు మొత్తం తీసుకొని పోగొట్టాడని.. ఈ విషయంలోనే గొడవ జరిగినట్లు రశ్మి పోలీసులకు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

రశ్మికి సుబ్రమణ్యానికి ఉన్న సంబంధం ఏంటంటే..

నిందితురాలు రశ్మికి సుబ్రమణ్యం రెండో భర్త అని తేలింది. ఆమెకు పన్నెండేళ్ల క్రితమే పెళ్ళి జరిగిందని.. అంతేకాదు.. సుమారు పదకొండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. అయితే మొదటి భర్తతో గొడవ జరగడంతో.. ఆయనకు విడాకులు ఇచ్చి.. నాలుగేళ్ల క్రితం సుబ్రమణ్యాన్ని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఏడాది పాటు బాగానే ఉన్నా.. గతకొద్ది కాలంగా అతనితో గొడవలు పడుతోంది. ఈ క్రమంలో.. ప్రేమించిన రెండో పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి.. మళ్లీ మొదటి భర్త వద్దకు వచ్చింది. ఇలా ఆరునెలలు ఉండి.. మళ్లీ తిరిగి రెండో భర్త వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో నగదు విషయంలో తలెత్తిన వివాదం.. సుబ్రమణ్యం హత్యకు దారితీసింది.