AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం..తండ్రిని పాశవికంగా హత్య చేసిన కొడుకు..

సమాజంలో విలువలు, మానవత్వం ఎప్పుడో మాసిపోయాయి. ఇప్పుడు మనుషుల్లో నెగిటివిటి బాగా పెరిగిపోయింది. ప్రజంట్ జనరేషన్ చెడు పట్ల ఎక్కవ ఆక్షర్షితులవుతున్నారు. అమ్మ, నాన్నలపై ప్రేమలు దేవుడెరుగు..కనీసం కనికరం కూడా లేకుండా పోతుంది. వారిపైనే చేయి చేసుకోవడం, గాయపరచడం వంటివి చేస్తూ కన్నప్రేమ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు కొందరు ప్రబుద్దులు. తాజాగా కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రిని కన్నకొడుకే అత్యంత పాశవికంగా హత్యచేశాడు. బండరాయితో మోది చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన నాన్ననే కడతేర్చాడు. ఈ […]

దారుణం..తండ్రిని పాశవికంగా హత్య చేసిన కొడుకు..
Ram Naramaneni
|

Updated on: Jan 29, 2020 | 3:57 PM

Share

సమాజంలో విలువలు, మానవత్వం ఎప్పుడో మాసిపోయాయి. ఇప్పుడు మనుషుల్లో నెగిటివిటి బాగా పెరిగిపోయింది. ప్రజంట్ జనరేషన్ చెడు పట్ల ఎక్కవ ఆక్షర్షితులవుతున్నారు. అమ్మ, నాన్నలపై ప్రేమలు దేవుడెరుగు..కనీసం కనికరం కూడా లేకుండా పోతుంది. వారిపైనే చేయి చేసుకోవడం, గాయపరచడం వంటివి చేస్తూ కన్నప్రేమ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు కొందరు ప్రబుద్దులు.

తాజాగా కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రిని కన్నకొడుకే అత్యంత పాశవికంగా హత్యచేశాడు. బండరాయితో మోది చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన నాన్ననే కడతేర్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా మర్డర్ చేసిన బాలుడు మైనర్ కావడం ఇక్కడ మరింత కంగారుపెట్టే అంశం.  వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో సయ్యద్ కుటుంబం నివశిస్తోంది. ఎప్పట్లాగే రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులందరూ నిద్రకు ఉపక్రమించారు. అయితే సయ్యద్ నిద్రలోకి జారుకున్న వెంటనే కొడుకు పెద్ద బండరాయి తీసుకువచ్చి అతడి తలపై వేశాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు..సయ్యద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.