మండలి రద్దుకు మోదీ గ్రీన్ సిగ్నల్!..ఇండికేషన్స్ ఇవే

ఆగమేఘాల మీద శాసనమండలి రద్దుకు జగన్ ప్రభుత్వం అడుగులు వేసిన తర్వాత కేంద్రం దగ్గర జాప్యం జరుగుతుందని, పార్లమెంటు ఆమోదం అంత త్వరగా పూర్తి కాదని విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ వాటిలో పస లేదన్న అభిప్రాయాన్ని తాజా పరిణామాలు చాటుతున్నాయి. జగన్ ప్రభుత్వం చేసిన పంపిన అసెంబ్లీ తీర్మానంపై కేంద్రం తక్షణమే స్పందించే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకుఅంటున్నారు. అందుకు రెండు కీలకాంశాలను చూపుతున్నారు. 2014లో అధికారం చేపట్టే నాటికి బీజేపీకి రాజ్యసభలో సంఖ్యాబలం అంతగా […]

మండలి రద్దుకు మోదీ గ్రీన్ సిగ్నల్!..ఇండికేషన్స్ ఇవే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 29, 2020 | 3:53 PM

ఆగమేఘాల మీద శాసనమండలి రద్దుకు జగన్ ప్రభుత్వం అడుగులు వేసిన తర్వాత కేంద్రం దగ్గర జాప్యం జరుగుతుందని, పార్లమెంటు ఆమోదం అంత త్వరగా పూర్తి కాదని విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ వాటిలో పస లేదన్న అభిప్రాయాన్ని తాజా పరిణామాలు చాటుతున్నాయి. జగన్ ప్రభుత్వం చేసిన పంపిన అసెంబ్లీ తీర్మానంపై కేంద్రం తక్షణమే స్పందించే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకుఅంటున్నారు. అందుకు రెండు కీలకాంశాలను చూపుతున్నారు.

2014లో అధికారం చేపట్టే నాటికి బీజేపీకి రాజ్యసభలో సంఖ్యాబలం అంతగా లేదు. లోక్‌సభలో బంపర్ మెజారిటీ వున్న బీజేపీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతీ కీలక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి యూపీఏ పక్షాల నుంచి మోకాలడ్డే వైఖరే ఎదురైంది. ఒకానొక సందర్బంలో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ప్రజాస్వామ్యబద్దంగా లోక్‌సభలో మెజారిటీలో ఏర్పాటైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను రాజ్యసభలో బలం వుందన్న ఉద్దేశంతో అడ్డుకుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం వుంది. ఈ లెక్కన ప్రజల నుంచి గెలిచి వచ్చిన సభ్యులు చేసేదే తుది శాసనం కావాలన్నది మోదీ అభిప్రాయంగా చెబుతున్నారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని మండలి రద్దు సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తం చేశారు.

మరోవైపు టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు.. మండలి రద్దు బిల్లును తాము (బీజేపీ) రాజకీయ కోణంలో చూడడం లేదని చెప్పుకొచ్చారు. మండలి రద్దు బిల్లును ఆగమేఘాల మీద పార్లమెంటు ముందుకు తీసుకువెళ్ళడం గానీ, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఉద్దేశం గానీ తమకు లేవని ఆయన చెప్పారు. మండలి రద్దు ప్రాసెస్ నిబంధనల ప్రకారమే జరుగుతుందని జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు.

ఒకవైపు పెద్దల సభ పెద్దరికంపై ప్రధాన మంత్రి మోదీ అభిప్రాయం.. అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని జీవీఎల్ వెల్లడించడం చూస్తుంటే.. ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియకు బీజేపీ పరోక్షంగా సహకరిస్తుందనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది. దానికి తోడు ఇటీవల బీజేపీతో జతకట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా మండలి రద్దు అంశం నేరుగా ప్రజలపై ప్రభావ చూపని కారణంగా తాము మండలి రద్దును వ్యతిరేకించబోమని చెప్పారు. సో.. మండలి రద్దుకు కేంద్రంలో ఏ అడ్డు లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలేనని అంటున్నారు పరిశీలకులు.

Latest Articles