AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భార్యతో సహా ఇద్దరు పిల్లలను హతమార్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్.. సూసైడ్ నోట్‌‌లో సంచలన విషయాలు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణాలు నిలపాల్సిన డాక్టరే ముగ్గురి ప్రాణాలను తీశాడు. కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్‌లో నివసిస్తున్న డాక్టర్ సుశీల్ కుమార్.. తన భార్య, కుమారుడు, కుమార్తెను హత్య చేశాడు.

Crime News: భార్యతో సహా ఇద్దరు పిల్లలను హతమార్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్.. సూసైడ్ నోట్‌‌లో సంచలన విషయాలు!
Crime
Balaraju Goud
|

Updated on: Dec 04, 2021 | 7:08 AM

Share

Kanpur Doctor kills wife, children: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణాలు నిలపాల్సిన డాక్టరే ముగ్గురి ప్రాణాలను తీశాడు. కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్‌లో నివసిస్తున్న డాక్టర్ సుశీల్ కుమార్.. తన భార్య, కుమారుడు, కుమార్తెను హత్య చేశాడు. ముందుగా పదువైన వస్తువుతో భార్య తలపై కొట్టాడు. ఆ తర్వాత కొడుకు, కూతురు గొంతుకోసి చంపాడు. అనంతరం ఇందుకు సంబంధించి సుశీల్ తన సోదరుడు డాక్టర్ సునీల్‌కు ఫోన్ ద్వారా మెసేజ్ పంపాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాను డిప్రెషన్‌లో ముగ్గురిని హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

ఘటనా స్థలంలో 10 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే, ఈ కోవిడ్ ఇప్పుడు అందరినీ చంపేస్తుందని అందులో రాసి ఉండటం గమనార్హం. Omicron ఎవరినీ విడిచిపెట్టదు, ఇక శవాలు లెక్కించాల్సిందే. నా అజాగ్రత్త వల్ల కెరీర్‌లో ఆ దశలోనే ఇరుక్కుపోయాను. ఎక్కడి నుంచి బయటకు రావడం అసాధ్యం అంటూ తన సోదరుడికి ఫోన్ మెసేజ్ పంపాడు డాక్టర్ సుశీల్. దీంతో కంగారుపడ్డ ఆయన సోదరుడు సునీల్ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

డాక్టర్ సుశీల్ కుమార్ ఇంద్రనగర్‌లోని డివినిటీ అపార్ట్‌మెంట్‌లో 48 ఏళ్ల తన భార్య చంద్రప్రభతో కలిసి నివాసం ఉంటున్నాడు. రామా మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అతని కుమారుడు శిఖర్ సింగ్ (18), కుమార్తె ఖుషీ సింగ్ (16) కూడా అదే అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం డాక్టర్ సుశీల్ కుమార్ తన సోదరుడు సునీల్‌కు మెసేజ్ చేశాడు. ముగ్గురిని హత్య చేశానని పేర్కొన్నాడు. ఈ మెసేజ్ చదివిన సునీల్ అపార్ట్ మెంట్ కి చేరుకున్నాడు. తలుపు లోపలి నుంచి గడియపెట్టి కనిపించింది. అతను తలుపు పగలగొట్టాడు. లోపలికి చేరుకుని చూడగా చంద్రప్రభ, శిఖర్, ఖుషీ మృతదేహాలు కనిపించాయి. ఈ క్రమంలో పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో ఘటనా స్థలంలో డైరీలోని ఓ నోట్ కూడా లభ్యమైంది. ఇందులో డా. సుశీల్ కుమార్ కుటుంబం హత్యతో సహా తన జీవితం గురించిన విషయాలు రాశాడు.

ఇదిలావుంటే, పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో సంచలన విషయాలు రాసినట్లు తెలిపారు.. ‘ఇక కోవిడ్ విజృంభణ తప్పదు. ఈ కోవిడ్ ఓమిక్రాన్ ఇప్పుడు అందరినీ చంపుతుంది. ఇక మృతదేహాలను లెక్కించుకోవల్సిందే. నా అజాగ్రత్త వల్ల కెరీర్‌లో ఆ దశలోనే ఇరుక్కుపోయాను. ఎక్కడి నుంచి బయటకు రావడం అసాధ్యం. నాకు భవిష్యత్తు లేదు. అందువల్ల, నా భావాలలో, నా కుటుంబాన్ని నాశనం చేయడం ద్వారా నన్ను నేను నాశనం చేసుకుంటున్నాను. దీనికి మరెవరూ బాధ్యులు కారు. నేను నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాను. భవిష్యత్తులో ఏదీ కనిపించడం లేదు. ఇది తప్పని తెలుసు, నాకు వేరే మార్గం లేదు. నా కుటుంబాన్ని కష్టాల్లో వదిలేయలేను. నేను అందరినీ విముక్తి మార్గంలో వదిలివేస్తున్నాను. ఒక్క క్షణంలో కష్టాలన్నింటినీ తొలగిస్తున్నాను. నా వెనుక ఎవరికీ ఇబ్బంది కనిపించడం లేదు. నా ఆత్మ నన్ను ఎప్పటికీ క్షమించదు. నయం చేయలేని కంటి వ్యాధి కారణంగా, నేను అలాంటి చర్య తీసుకోవలసి వచ్చింది.అంటూ డైరీలో రాసినట్లు పోలీసులు తెలిపారు.

సోదరుడు సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. అతని సోదరుడు డాక్టర్ సుశీల్ కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నాడు. హత్య తర్వాత అతడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అందుకే పోలీసులు అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also…. Cyclone Jawad: జోవాద్ అలెర్ట్.. ఉత్తరాంధ్రలో వర్షాలు.. ఎగసిపడుతున్న సముద్రం..ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు